Chandrababu And Pawankalyan:సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ ఏపీలో అప్పుడే పొలిటికల్ ఫీవర్ పట్టుకుంది. అధికార పార్టీ సంగతి అటుంచితే.. ప్రతిపక్ష పార్టీలు పొత్తులపై ఇప్పుడే మల్లగుల్లాలు పడుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని ఇరు పార్టీల నాయకులు అనుకున్నారు. ఒకరికొకరు సపోర్టు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ ఒక్కసారిగా బాంబ్ పేల్చడంతో టీడీపీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తుల వరకు ఓకే గానీ.. సీఎం మాత్రం చంద్రబాబే కావాలని సైకిల్ సైన్యం పట్టుబడుతోంది. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఈ విషయంపై తీవ్రంగా మదనపడుతున్నారట. ఆనోటా..ఈనోటా.. ఈ చర్చ చంద్రబాబు వరకు వెళ్లడంతో ఆయన కూడా ఆలోచనలో పడినట్లు సమాచారం. కానీ కొందరు మాత్రం పంతం గురించి ఆలోచించకుండా సామరస్యంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
2014 ఎన్నికల్లో పవన్ పార్టీ పెట్టకముందు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు. ఆ పార్టీ తరుపున ప్రచారం చేశారు. దీంతో ఆ సమయంలో సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ చేసిన కృషిని అప్పట్లో టీడీపీ నాయకులు కూడా మెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కొత్త పార్టీతో ఒంటరిగా పోటీ చేశారు. అటు టీడీపీ కూడా ఏ పార్టీతో కలిసుండకుండా ఎన్నికలకు వెళ్లింది. దీంతో దారుణంగా ఓటమి పాలైంది. 23 సీట్లు తెచ్చుకున్న పసుపు పార్టీ ఓట్ల విషయంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు. ఎందుకంటే కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే చంద్రబాబుకు పడడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో టీడీపీలోని కొందరు నాయకులు పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా లాభిస్తుందని ఆలోచించారు. కొందరు ఏకంగా ఆయనతో మీటింగ్ పెట్టారు. టీడీపీ నేత చంద్రబాబు సైతం ఓ సమావేశంలో ‘పొత్తు పెట్టుకుంటే తప్పేంటి..?’ అనే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ తరువాత టీడీపీలోని సీనియర్ నాయకులు సైతం బాబు మాటకు కట్టుబడి ఉన్నారు. కానీ జనసేన నేత పవన్ మాత్రం కాస్త సమయం తీసుకున్నారు. ఇటీవల నర్సాపురంలో నిర్వహించిన సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖాయమని తేల్చారు. అయితే టీడీపీతో మాత్రం ఇప్పుడే తేల్చలేమని చెప్పారు. టీడీపీ నేత చంద్రబాబు పవన్ తో పొత్తు పెట్టుకుంటామని పరోక్షంగా చెప్పినప్పటికీ.. పవన్ మాత్రం సస్పెన్స్ లో పెట్టడంతో టీడీపీ నాయకలు నిరాశ చెందారు. అంతేకాకుండా బీజేపీతో పొత్తు ఉన్నా సీఎం అభ్యర్థి పవన్ అని జోరుగా ప్రచారం సాగింది. ఆ విషయలో బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం పవన్ తో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబే సీఎం అని అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబును మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నారని, అలాగైతేనే కష్టపడి పనిచేస్తామని ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారట.
ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లడంతో పొత్తులపై అప్పుడే డిసైడ్ కావద్దని సూచించారట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఆ సమయం వచ్చే సరికి పార్టీ కేడర్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని బుజ్జగించారట. అయితే ఈ తరుణంలో కొందరు ఇరు పార్టీల్లోని నాయకులు మాత్రం ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇవి ఇలాగే ఎక్కువైతే మాత్రం బంధం తెగుతుందా..? అని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఏదీ ఏమైనా కొందరు టీడీపీ నాయకుల మనసులో పవన్ తో వెళ్తే కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంతాలకు పోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కొందరు అంటున్నారు. కానీ సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం తమ నేతకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే