https://oktelugu.com/

PrasanthNeel: ప్రశాంత్ నీల్ కు కొత్త చిక్కులు: ఆ పాయింట్ పై విపరీత ట్రోలింగ్..

PrasanthNeel:‘ఒక్క అవకాశం వస్తే చాలు.. నా ప్రతాపమంటే ఏంటో చూపిస్తా..’ అని ఓ సినిమాలో రవితేజ డైలాగ్ కొడుతాడు. ఈ డైలాగ్ హీరోలకే కాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లందరికీ పనిచేస్తుంది. ఎందుకంటే మొదటి సినిమాతోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటులు, టెక్నిషీయన్లు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు ఓ సినిమా హిట్టయితే హీరో పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలను ప్రేక్షకులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు […]

Written By: , Updated On : June 12, 2022 / 08:45 AM IST
Follow us on

PrasanthNeel:‘ఒక్క అవకాశం వస్తే చాలు.. నా ప్రతాపమంటే ఏంటో చూపిస్తా..’ అని ఓ సినిమాలో రవితేజ డైలాగ్ కొడుతాడు. ఈ డైలాగ్ హీరోలకే కాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లందరికీ పనిచేస్తుంది. ఎందుకంటే మొదటి సినిమాతోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటులు, టెక్నిషీయన్లు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు ఓ సినిమా హిట్టయితే హీరో పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలను ప్రేక్షకులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు డైరెక్టర్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఫ్యాన్స్ ను తయారు చేసుకుంటున్నారు. అలా ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారినవారు ఎందరో ఉన్నారు.. అలాంటి వారిలో ప్రశాంత్ నీల్ ఒకరు.

కేజీఎఫ్ 1,2, సినిమాకు ముందు ప్రశాంత్ నీల్ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆయన రాజమౌళి లాంటి బిగ్గెస్టు సరసన చేరానని కొందరు అంటున్నారు. మాస్ ప్రేక్షకులకు మంచి మసాలా ఇచ్చే డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు అని అంటున్నారు. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. కన్నడ పరిశ్రమకు చెందిన ఆయనకు ఇతర ఇండస్ట్రీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆయన టాలీవుడ్ వైపు ఇంట్రెస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 రిలీజ్ కు ముందే ప్రభాస్ తో సలార్ సినిమా ప్రారంభించారు. ఆ సినిమాకు సంబంధించిన లుక్స్, షూటింగ్ వీడియోస్ కొన్ని లీకయ్యాయి. ప్రభాస్ తో సినిమా పూర్తయిన తరువాత ప్రశాంత్ నీల్ మాస్ హీరో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న విషయం బహిర్గతమైంది. ఆ సినిమాకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. దీంతో ప్రశాంత్ నీల్ మార్క్ టాలీవుడ్ పై బాగా పడనుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ కు ఎంత అభిమానులు ఉన్నారో.. అంతేస్థాయిలో కొందరు నచ్చని వారున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటే ఉంటుంది. కోల్ లేదా బొగ్గు గనులకు సంబంధించిన స్టోరీ ఉంటోంది. కేజీఎఫ్ లో బంగారం గనుల గురించి చూపించిన ఆయన ప్రభాస్ తో కలిసి బొగ్గు గనుల గురించి సినిమా తీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ ఫేస్ కు నల్లటి మసి పూసిన పిక్స్ బయటికొచ్చి వైరల్ గా మారాయి.

ఇక ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన లుక్స్ లోనూ జూనియర్ నల్లటి ముఖంతో కనిపించాడు. దాదాపు ఈ సినిమా కూడా ఓ గని గురించే ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ కళ్లకి గనులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదా..? అని కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే పండ్లున్న చెట్టుకే దెబ్బలు తగిలినట్లు ఒక డైరెక్టర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్న సమయంలో ఇలాంటి ట్రోల్స్ కామన్ అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.