Government step back: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారాలని కోరుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ముందువరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, ప్రమోషన్స్, ఇతర సమస్యలన్నీ తీరుతాయని భావించారు. అయితే జగన్ సీఎం రెండున్నర ఏళ్లలోనే వారికి ఆశించిన ఫలితాలు రాకపోగా ఉన్న జీతాల్లో కోత పడటం వారిలో ఆగ్రహానికి కారణమైంది.
పీఆర్సీ విషయంలో కప్పదాట్లు వేసిన ప్రభుత్వం చివరికీ నాలుగైదు డీఎలను కలుపుతున్నామని చెప్పింది. తీరా జీతాలు పెరగకపోగా ఒక్కొక్కరికి సగటున నాలుగు నుంచి ఐదువేల రూపాయాలు తగ్గినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీతాల కోసం ఏకంగా 10వేల కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నామని వాదిస్తోంది. ఈనేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే చలో విజయవాడ సభకు ఇటీవల పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉండదని ప్రభుత్వం భావించింది. అయితే అనుహ్యంగా ఉద్యోగులకు విజయవాడ ప్రజలకు భారీగా మద్దతు తెలుపడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
Also Read: చరిత్రలో నిలిచేలా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రేపు ప్రధాని రాక..
కరోనా, పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం? అవుతుందా? లేదా అన్న సందేహాలు కలిగాయి. అయితే ఈ ఉద్యమాన్ని నడిపిస్తుందే ఉద్యోగులే కావడంతో వారంతా ఈ కార్యక్రమానికి వెల్లువలా వచ్చారు. అయితే వారికి కావాల్సిన కనీస సదుపాయాలైన మంచినీళ్లు, భోజన సదుపాయాన్ని మాత్రం స్థానిక ప్రజలే తీర్చారు.
ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలనీ వైసీపీ నేతలు, ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇంటింటికీ పాంపెట్లు పంచింది. అయితే ఆ ప్రభావం ఉద్యోగులపై ఎక్కడా కన్పించలేదు. ఉద్యోగుల చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి విజయవాడ ప్రజలు సహకరించారు. ఇది ఒకరకంగా వారికి ఊరట కలిగింది. ఉద్యోగులు జీతాలు పెంచాలని డిమాండ్ ను పక్కన పెట్టి పాత జీతాలైనా ఇవ్వాలని కోరుతున్నారు.
ఈక్రమంలోనే వారికి ప్రజలను నుంచి పెద్దఎత్తున ఉద్యోగులకు మద్దతు లభిస్తుందని తెలుస్తోంది. ఉద్యోగులకు ప్రజల మద్దతు లభిస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయే ఎన్నికల్లో నష్టోయేది వైసీపీననే కామెంట్స్ విన్పిస్తున్నాయి. మరీ ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకెళుతారో వేచిచూడాల్సిందే..!
Also Read: మరో స్టార్ హీరోకి విడాకులు… త్వరలో షాకింగ్ ప్రకటన!