Sri Ramanuja: చరిత్రలో నిలిచేలా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రేపు ప్రధాని రాక..

Sri Ramanuja: గతంలో ఎన్నడూ జరగని విధంగా, భవిష్యత్తులోనూ ఎక్కడా నిర్వహించని విధంగా శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింత్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. త్రిదిండి చిన జీయర్ స్వామి ఆశ్రమం ఈ వేడుకలను కన్నుల పండువగా జరుపుతున్నారు. ఇక్కడికి భక్తులతో పాటు ప్రముఖులు సైతం చాలా మంది వస్తున్నారు. ఇలాంటి వేడుకలను మునుపెన్నడూ చూసి ఉండము అనే తీరుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల ప్రాంగణం మొత్తం యజ్ఞయాగాల మంత్రాలు, భక్తుల నినాదాల మధ్య హోరెత్తింది. […]

Written By: Mallesh, Updated On : February 4, 2022 12:28 pm
Follow us on

Sri Ramanuja: గతంలో ఎన్నడూ జరగని విధంగా, భవిష్యత్తులోనూ ఎక్కడా నిర్వహించని విధంగా శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింత్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. త్రిదిండి చిన జీయర్ స్వామి ఆశ్రమం ఈ వేడుకలను కన్నుల పండువగా జరుపుతున్నారు. ఇక్కడికి భక్తులతో పాటు ప్రముఖులు సైతం చాలా మంది వస్తున్నారు. ఇలాంటి వేడుకలను మునుపెన్నడూ చూసి ఉండము అనే తీరుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Sri Ramanuja

వేడుకల ప్రాంగణం మొత్తం యజ్ఞయాగాల మంత్రాలు, భక్తుల నినాదాల మధ్య హోరెత్తింది. భూమిపై ఇప్పటి వరకు ఎక్కడ చేయని విధంగా ఈ మహా క్రతువు నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులతో రామానుజ సహస్రాబ్ది సమారోహం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం అగ్ని మథనంతో మహా యజ్ఞం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా రామానుజ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులపై సమీక్ష నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు అక్కడ జరుగుతున్న పనులు, ఏర్పాట విషయాలను సీఎం కు వివరించారు. మద్రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక వంటిదని సీఎం అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని.. ఆయన అందరినీ సమానంగా ప్రమేస్తారని తెలిపారు. రామనుజ స్ఫూర్తితో అందరం ముందుకు సాగాలని ఆకాక్షించారు. తర్వాత యాగశాలను సందర్శించి పెరుమాళ్లను దర్శించుకున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలను సైతం వైభంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని సురేఖామూర్తి టీం భక్తి గీతాలను ఆలపించి అందరినీ అలరించారు. శ్రీపాద రమాదేవి నృత్యాలు, నర్సింహారావు బృందం ఆధ్వర్యంలో భజనలు, ప్రణవి నృత్యం, కిలాంబి శ్రీదేవి సంగీతం బాగా ఆకట్టుకున్నాయి.. రాత్రి సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు తారక రామారావు స్పెషల్ ప్రోగ్రాం, చెన్నై నుంచి విచ్చేసిన మాధవపెద్ది టీం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం మొదలవడానికి ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి ఎంఎల్ఏ రోజా పాల్గొని చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలు తీసుకున్నారు.

Also Read: చలో విజయవాడ సక్సస్.. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనా?

అరణి మధనంతో వేడుకలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహాయాగాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించారు. దానిని పెద్దది చేస్తూ 1035 కుండలాలున్న యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలను నాలుగు భాగాలుగా విభజించామని త్రిదండి చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. యాగశాల కుడి వైపు భాగాన్ని భోగ మండమం అని, మధ్య భాగాన్ని పుష్ప మండలం అని, వెనక ఉన్న భాగాన్ని త్యాగ మండలం అని, ఎడమ వైపు ఉన్న భాగాన్ని జ్ఞాన మండపం అని పేరు పెట్టారు. అనందరం చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీ నారాయణ మహా క్రతువు మొదలైంది. ఇందులో అయోధ్య, నేపాల్, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటుగా తెలంగాణ, ఏపీలోని ప్రముఖ స్వాములు పాల్గొన్నారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి హాజరైన స్వాములకు మైహోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు దీక్షా వస్త్రాలను వారికి అందించారు.

ఇక్కడ భక్తుల రద్దీ సైతం చాలా పెరుగుతోంది. గురువారం సుమారు 2 వేల మందికి పైగా భక్తులు పెద్దజీయర్ స్వామిని పూజించారు. తర్వాత పాలపర్తి శ్యామలానంద ప్రసాద్.. భగవద్రామానుజ వైభవంపై ప్రసంగించారు. భజనలు, నృత్యాలు, గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక 5వ తేదీన ప్రధాని మోడీ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ప్రధాని చేతుల మీదుగా 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందుకు తెలంగాణ సీఎం సైతం హాజరవుతారని సమాచారం.

Also Read: సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి కుంప‌ట్లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్

Tags