https://oktelugu.com/

Shocking News: మరో స్టార్ హీరోకి విడాకులు… త్వరలో షాకింగ్ ప్రకటన!

Shocking News: సెలబ్రిటీల విడాకుల వార్తలు చాలా కామన్ అయిపోయాయి. బాలీవుడ్ లో ఇది ఓల్డ్ ట్రెండ్ కాగా.. సౌత్ లో కూడా ఊపందుకుంటుంది. నెలల వ్యవధిలో ఇద్దరు సౌత్ స్టార్స్ విడాకుల ప్రకటన చేశారు. సమంత-నాగ చైతన్యల విడాకులు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్ నాలుగేళ్ల సంసారం తర్వాత గుడ్ బై చెప్పుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న విడాకుల ప్రకటన చేశారు. సమంత, చైతూ విడాకుల […]

Written By:
  • Shiva
  • , Updated On : February 4, 2022 / 12:14 PM IST

    Shocking News

    Follow us on

    Shocking News: సెలబ్రిటీల విడాకుల వార్తలు చాలా కామన్ అయిపోయాయి. బాలీవుడ్ లో ఇది ఓల్డ్ ట్రెండ్ కాగా.. సౌత్ లో కూడా ఊపందుకుంటుంది. నెలల వ్యవధిలో ఇద్దరు సౌత్ స్టార్స్ విడాకుల ప్రకటన చేశారు. సమంత-నాగ చైతన్యల విడాకులు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్ నాలుగేళ్ల సంసారం తర్వాత గుడ్ బై చెప్పుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న విడాకుల ప్రకటన చేశారు. సమంత, చైతూ విడాకుల వార్త సద్దుమణగక ముందే మరో స్టార్ డివోర్స్ ప్రకటించారు.

    Shocking News

    కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేశారు. 18 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వివరించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్… ఆయన కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తారని ఎవరూ ఊహించలేదు.

    Also Read:  మెగా వేలం వేళ ఫ్రాంచైజీల వ్యూహాలు.. హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్ వీళ్లే..!

    ఇక ఐశ్వర్య-ధనుష్ విడాకుల వెనక అఫైర్స్ కారణమంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ధనుష్ ప్రవర్తనతో విసిగిపోయిన ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్దవాళ్ళు ఇంకా కలిపే ప్రయత్నాలు ఆపలేదు. విడాకుల ప్రకటన తర్వాత హైదరాబాద్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఐశ్వర్య, ధనుష్ కుటుంబ సభ్యులతో పాటు కనిపించారు.

    కాగా త్వరలో ఇంకో షాకింగ్ న్యూస్ రానుందని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి . మరో స్టార్ హీరో విడాకులు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించి రంగం పూర్తి కాగా ప్రకటనే మిగిలి ఉందని సమాచారం.కెరీర్ ప్రారంభంలో విలన్ గా చేసిన ఈ 50 ఏళ్ల సీనియర్ హీరో ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ గా చలామణి అయ్యారు. టాలీవుడ్ లో వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ కి పోయి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత కెరీర్ నెమ్మదించింది. వరుస పరాజయాలతో డీలాపడ్డ సదరు హీరో… పరిశ్రమలో ప్రస్తుతం అంత యాక్టివ్ గా లేరు.

    Shocking News

    40 ఏళ్ల వయసులో అత్యంత సన్నిహితుల మధ్య ఈ హీరో వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం చేసుకుంది మరలా ఓ నటిని కావడం విశేషం. మనస్పర్థల కారణంగా భార్యతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. విడాకులకు అప్లై కూడా చేశారట. త్వరలో అధికారిక ప్రకటన రానుందనేది ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. కుర్ర హీరోలతో పాటు సగం వయసైన స్టార్స్ కూడా ఈ వయసులో విడాకుల ప్రకటనలు చేయడం విడ్డూరమే అని చెప్పాలి.

    Also Read: అవధానికే పాఠాలు చెబుతున్న ‘అల్లు’ ఫ్యాన్స్..!

     

    Tags