Supreme Court: సీజేఐ రంగంలోకి దిగితే తప్ప.. కూర్చోవడానికి కుర్చీలు రాలేదు..

మంగళవారం పారిశ్రామికంగా మద్యం తయారీ, అమ్మకాలు నియంతను ఇచ్చే శాసన అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై కేసు విచారణ జరిగింది.. ఈ కేసును ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ మెహతా, ఇతర 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం వాదిస్తున్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 10, 2024 10:54 am

Supreme Court

Follow us on

Supreme Court: మన న్యాయ వ్యవస్థ గొప్పది.. అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పటికీ .. వాటిని అప్పుడప్పుడు చర్నా కోల్ తో కొడుతూ ఆదిలిస్తుంటుంది. వాటి బాధ్యతను గుర్తు చేస్తుంటుంది.. అందుకే ఇప్పటికి చాలామంది తమకు ఇతర వ్యవస్థల వల్ల అన్యాయం జరిగినప్పుడు.. తొంగి చూసేది ఆ సుప్రీంకోర్టు వైపే.. అందుకే సర్వోన్నత న్యాయస్థానం.. బాధితుల పక్షాన ఉంటుంది కాబట్టి సర్వోన్నతంగా వెలుగొందుతోంది. మరి అంతటి ఘనత ఉన్న న్యాయస్థానంలో.. కూర్చోవడానికి కుర్చీలు లేవు. న్యాయం చెప్పే న్యాయమూర్తులు.. ఇన్నాళ్లపాటు నిలబడే ఉన్నారు.. చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే తప్ప వారికి కుర్చీలు రాలేదు. చదువుతుంటే విస్మయం కలుగుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.. స్వయానా ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. అయితే దీనిని ప్రాంతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు కానీ.. జాతీయ మీడియా మాత్రం బాగా హైలైట్ చేసింది.

మంగళవారం పారిశ్రామికంగా మద్యం తయారీ, అమ్మకాలు నియంతను ఇచ్చే శాసన అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై కేసు విచారణ జరిగింది.. ఈ కేసును ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ మెహతా, ఇతర 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం వాదిస్తున్నది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్ర చూడ్ మధ్యలో కల్పించుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది.. పేరుపొందిన న్యాయవాదులు ఒక్కసారిగా చంద్ర చూడ్ వైపు చూశారు. ఆయన వెంటనే కల్పించుకొని ” మిస్టర్ సొలిసిటర్.. మా యువకులు మొత్తం రోజు విడిచి రోజు నిలబడటం నేను గమనిస్తున్నాను. వారి చేతిలో ల్యాప్ టాప్ లు ఉన్నాయి. నేను మధ్యాహ్నం వరకు కోర్టు మాస్టర్ వెంటనే వారిని మీ వెనుక ఉంచగలరో? లేదో? నేను చూస్తానని” ప్రధాన న్యాయమూర్తి మెహతాతో వ్యాఖ్యానించారు. దానికి ఆయన స్పందించారు..” నేను కూడా దానిని గమనిస్తున్నాను. ఈ కేసుతో సంబంధంలేని న్యాయ వాదులు న్యాయస్థానంలో ఉన్న కుర్చీలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరాను” అని అన్నారు.. దానికి సమాధానంగా “కోర్టు మాస్టర్ కు చెప్పాను.. కొన్ని కుర్చీలు వేస్తే.. యువ న్యాయవాదులకు వెసులుబాటుగా ఉంటుందని” చంద్ర చూడ్ వ్యాఖ్యానించారు. వారిద్దరి మధ్య ఇలా సంభాషణ పూర్తయిన తర్వాత.. మధ్యాహ్నం భోజనం సమయం అయింది.

అంతా భోజనం చేసి మళ్లీ కోర్టులోకి వచ్చారు. కోర్టులోకి రాగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కోర్టు హాల్లో వరుసగా కుర్చీలు కనిపించాయి. కోర్టు ప్రారంభానికి ముందు చంద్ర చూడ్ సీట్లు వేసిన విధానాన్ని పరిశీలించారు. యువ న్యాయవాదులు కూర్చున్న కుర్చీలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం తదుపరి విచారణ యధావిధిగా కొనసాగింది. సుప్రీంకోర్టులో యువ న్యాయవాదులు గత కొంతకాలంగా అలా నిల్చోని కేసు విచారణ ప్రక్రియలను పరిశీలిస్తున్నారు. అయితే వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయడం లేదు.. దీంతో వారు అలా పొద్దంతా నిలబడాల్సి వస్తోంది. వారి బాధను చూసిన సీజేఐ చంద్ర చూడ్ మంగళవారం ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సొలిసిటర్ జనరల్ తో మాట్లాడారు. అనంతరం కోర్టు మాస్టర్ కు ఆదేశాలు జారీ చేసి కుర్చీలు ఏర్పాటు చేయించారు.. ఈ కుర్చీలు ఏర్పాటు చేయించినందుకు
చంద్ర చూడ్ కు యువ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు..”ఈరోజు యువ న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీటిని తెలియజేయడానికి నా వద్ద పదాలు లేవు. ఇన్ని రోజులపాటు వారు నిలబడి తన పని చేశారు. ఇకనుంచి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కేసులతో సంబంధంలేని న్యాయవాదులు బయట ఉండడం మంచిదని” కోర్టులో కుర్చీలు వేసిన అనంతరం మీడియాతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు..కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పట్టించుకుంటే తప్ప కోర్టులో కుర్చీలు వేయలేరా అంటూ? నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.