https://oktelugu.com/

ఇంతలోనే అంత మార్పు ఏంటబ్బా..!

రాజకీయ పార్టీలో వ్యక్తులు మారతారు… కాని సిద్ధాంతాలు మారవని నాయకులు తరచూ చెబుతుంటారు. నిర్ణీత కాలంలో పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు మారినా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే వారు నడుస్తారు. బీజేపీ వ్యవహారంలో మాత్రం అలా జరగడం లేదు. పార్టీలో వ్యక్తులు మారినప్పుడల్లా సిద్ధంతాలు మారిపోతున్నాయి. ఒక్కోక్కరికి ఒక సిద్ధాంతం ప్రాధాన్యత ఉంటే… మరోకరు వచ్చినప్పడు మరో సిద్ధంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నూతన అధ్యక్షుడు వెల్లడించిన విషయాలు ఇదే రకంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 31, 2020 5:17 pm
    Follow us on


    రాజకీయ పార్టీలో వ్యక్తులు మారతారు… కాని సిద్ధాంతాలు మారవని నాయకులు తరచూ చెబుతుంటారు. నిర్ణీత కాలంలో పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు మారినా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే వారు నడుస్తారు. బీజేపీ వ్యవహారంలో మాత్రం అలా జరగడం లేదు. పార్టీలో వ్యక్తులు మారినప్పుడల్లా సిద్ధంతాలు మారిపోతున్నాయి. ఒక్కోక్కరికి ఒక సిద్ధాంతం ప్రాధాన్యత ఉంటే… మరోకరు వచ్చినప్పడు మరో సిద్ధంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నూతన అధ్యక్షుడు వెల్లడించిన విషయాలు ఇదే రకంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

    Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

    బీజేపీలో నిన్నటి వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతి నుంచి తరలించకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. రాజధాని రైతుల నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఇటీవల పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అమోదం కోసం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరడంతో ఆ రెండు బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖ రాశారు.

    రెండు రోజుల కిందట కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాత్రం రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మీడియాకు స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నాడు చంద్రబాబు అమరావతిని ఎంపిక చేసినప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదని, ప్రస్తుతం జోక్యం చేసుకోదని తెలిపారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా పోరాటం చేస్తామని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇంతలో బీజేపీ పార్టీలో ఎంత మార్పు వచ్చిందని రాజధాని ప్రాంత వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

    Also Read: రంజుగా అరకు రాజకీయం..!

    బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నాను తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజును నియమించిందనే వాదనులు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు వాఖ్యలు ఈ వాదనలు నిజమే అనేవిగా ఉండటం విశేషం. మరోవైపు బీజేపీ-జనసేన కూటమి తృతీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని సోము చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగా నడుస్తూపోతుంటే తృతీయ కూటమిగా బలపడేదెప్పుడన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.

    మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుటుందని స్పష్టం చేశారు. శాసన మండలి ఆమోదించని బిల్లులను గవర్నర్ ఆమోదించడానికి వీలు లేదని, వీటిని రాష్ట్రపతికి పంపాలని అన్నారు. ఆయన అమరావతికి పూర్తి అనుకూలంగా మాట్లాడారు. బీజేపీ నాయకుల మధ్య రాజధాని అమరావతి విషయంలో పరస్పర వైరుద్య భావాలు, అభిప్రాయాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ జాతీయ నాయకత్వానిదే.

    Tags