మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పీవీ బ్రతికున్నప్పుడు.. చనిపోయిన తర్వాత కూడా ఆయన మావాడు కాదని దూషించిన వాళ్లే నేడు ఆయనను వేయినోళ్ల పొగుడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పీవీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పీవీ విషయంలో మనస్సు మార్చుకున్నాడు. తెలంగాణ వాడైన పీవీ ప్రధాని కావడం గొప్పవిషయమని ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పీవీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా మలుచుకొని జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.
Also Read: రంజుగా అరకు రాజకీయం..!
సీఎం కేసీఆర్ పీవీని తమ నేతగా మలుచుకోవడంతో కాంగ్రెస్ అలర్టయింది. స్థానిక నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పీవీని ఎన్నడూ పొగడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆయన సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ నేతలకు లేఖ రాశారు. ఈ లేఖలను పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. అయితే పీవీ బ్రతికున్న రోజుల్లోనూ ఆయనపై కుట్రలు చేసి, ఆయన చనిపోయిన తర్వాత పీవీ ఇమేజ్ తమకు అవసరం లేదనుకున్న నేతలు ఇప్పుడు పీవీ నామస్మరణ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో పీవీ మావాడంటే.. మావడని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కొట్లాడుకుంటున్నారు. పీవీ తెలంగాణకు చెందిన వాడు కావడంతో ఆయన ఇమేజ్ ఎవరికీవారు క్యాష్ చేసుకునేందుకు తహతహలాడుతోన్నారు. సీఎం కేసీఆర్ పీవీ కూతురుకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఏపీలోనూ పీవీ నర్సింహారావు పేరు త్వరలో మార్మోగడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఏపీ సీఎం జగన్ నూతన ఏర్పాటు చేయబోయే జిల్లాలకు పీవీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు పేరును ఓ జిల్లాకు సీఎం జగన్ పెట్టానున్నారని టాక్ విన్పిస్తోంది. దీని వల్ల జగన్ పేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చిరకాలం గుర్తిండిపోనుంది.
Also Read: టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!
తెలంగాణవాడు, తెలుగువాడైన పీవీ పేరును ఏపీలోని జిల్లాకు పెట్టడం ద్వారా సీఎం జగన్ దివంగత రాజశేఖర్ లా తెలంగాణవారికి మరింత దగ్గరవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ వైసీపీ బలపర్చాలని జగన్ భావిస్తున్నారు. పీవీ పేరు ఏపీలోని జిల్లాకు పెట్టడంతో ద్వారా తెలంగాణలోనూ వైసీపీకి మరింత మైలేజ్ రావడం ఖాయమని వాదనలు విన్పిస్తుంది. దీంతో సీఎం జగన్ కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఒక జిల్లాకు పీవీ పేరు పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మనం వేచి చూడాల్సిందే..!