Gautam Adani: సరిగ్గా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇందుకు ఆదానీ విమానాలను, హెలికాప్టర్ ల ను వాడుకున్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గుజరాత్ నుంచి ఢిల్లీకి అదానీ విమానంలోనే వచ్చారు. గతంలో ఆదానీతో మోడీకి మైత్రి ఉన్నా 2014 ఎన్నికల నుంచి అది మరింత బలపడింది. అది ప్రస్తుతానికి తారస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆదాని కోసం మోడీ ఏదైనా చేయగలరు. శ్రీలంకలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రాజెక్టు కైనా, ఆస్ట్రేలియాలో దక్కించుకునే బొగ్గు గనులైనా…ఇలా ఏ పనులైనా చిటికలో చేసి పెడతారు. ఈ స్నేహం వల్లే ఆదాని అంతకంతకు ఎదిగిపోతున్నారు. కరోనా నుంచి ఇప్పటిదాకా అంటే ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారుల సంపద తిరోగమనంలో ఉంటే ఆదానిది మాత్రం పురోగమనంలో ఉంది. అంతెందుకు టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కూడా కిందా మీదా పడుతుంటే.. గౌతమ్ అదానీ మాత్రం వ్యాపారాన్ని అంతకు మించి స్థాయిలో విస్తరించుకుంటూ పోతున్నాడు. అలాంటి అదానీ కి ఇప్పుడు మోదీ ప్రాణ రక్షణ కల్పిస్తున్నాడు.

అదానీ కి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
ప్రస్తుతం దేశంలో రోజూ ట్రోల్ అవుతున్న వ్యాపారి ఎవరైనా ఉన్నారంటే అది గౌతం అదానీనే. ఆయనకంటే ధనవంతుడు ముఖేష్ అంబానీ ఉన్నప్పటికీ నెటిజన్ల దృష్టి మొత్తం అదానీ మీద ఉంది. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం ఆదానికి చేస్తున్న మేళ్ళే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అంబానీ కంపెనీలకు ఈ స్థాయిలోనే ప్రోత్సాహాలు అందేవి. అంతెందుకు కృష్ణ, గోదావరి బేసిన్ లో చమురు వెలికితీతకు సంబంధించి తమ కంపెనీకి అడ్డుపడుతున్నారని సోనియాగాంధీకి ముఖేష్ అంబానీ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆమె అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డిని తొలగించి ఇతర శాఖలోకి మార్చారు. ఈ ఒక్క సంఘటన చాలు దేశంలో కార్పొరేట్, రాజకీయ నాయకుల మైత్రి ఎంత బలంగా ఉంటుందో చెప్పేందుకు. అయితే ప్రస్తుతం గౌతమ్ ఆదాని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న పేరు కావడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది.
Also Read: KCR vs Modi: మోదీ ఎలా శత్రువయ్యాడు.. కేసీఆర్ భయం అదేనా?

జెడ్ ప్లస్ కేటగిరి అంటే ఏమిటి
ప్రస్తుతం మనదేశంలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రత అనుభవిస్తున్న ఒకే ఒక్క వ్యాపారి ముఖేష్ అంబానీ. ఈయనకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, హై కోర్టు న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర క్యాబినెట్ సభ్యులకు మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. మనదేశంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంతమందికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. దేశంలో ఇలా 63 మంది జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందుతున్నారు. ఇందులో రాహుల్ గాంధీ, చంద్రబాబు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి వారు ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలు భద్రత ఉంటుంది. మూడు షిఫ్టులవారీగా 36 మంది భద్రత సిబ్బంది కాపలా కాస్తు ఉంటారు. ఇక ఈ కేటగిరిలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సిఐఎస్ఎఫ్ లు భద్రతా విధులు నిర్వహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఐటిబిపి, సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్ గా ఉంటారు. జెడ్ ప్లస్ కేటగిరీలో భాగంగా రక్షణ కల్పించే ఎన్ ఎస్ జి కమాండోల దగ్గర ఎంపీ 5 సబ్మిషన్ గన్లు, ఏకే 47 రైఫిల్లు సహా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా వివిఐపి లకు పైలట్, ఎస్కార్ట్ కారు నిరంతరం అందుబాటులో ఉంటుంది.. ఇక ప్రస్తుతం గౌతమ్ అదాని కూడా జెడ్ ప్లస్ కేటగిరి భద్రత విభాగంలోకి వెళ్తున్న సందర్భంగా ఇందుకు నెలకయ్యే 20 లక్షల వరకు ఖర్చును ఆయనే భరించాల్సి ఉంటుంది.
Also Read:Rajinikanth Governorship: రజనీకాంత్ కు గవర్నర్ గిరి… బీజేపీ స్కెచ్ వెనుక కథా అదా?
[…] Also Read: Gautam Adani: అదానీ ప్రాణాలకు మోడీ భద్రత […]