Top 5 electric scooters: భారతదేశంలో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు పెట్రోల్ ద్విచక్ర వాహనాలు ఉన్నవారు వాటి స్థానంలో EV లను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా కొనాలని అనుకునేవారు సైతం EVల వైపు మల్లుతున్నారు. స్కూటర్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు సైతం ఇటీవల విట్రాలు ఎక్కువగా జరుపుకుంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకునేవారు ఏది బెటర్? అనే సందేహం లో ఉంటూ వస్తుంటారు. చాలామంది టూ వీలర్ కొనాలి అనుకునేవారు మైలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే ధర విషయంపై కూడా సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటి వారికి బెస్ట్ ఎలక్ట్రిక్ టూవీలర్ ఏదో ఎప్పుడూ చూద్దాం .
టు వీలర్ కోరే వారి ఆలోచనలో భాగంగా మైలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల మైలేజ్ అధికంగానే ఉంటుంది. అయితే ఇందులో ఉండే బ్యాటరీని బట్టి మైలేజ్ నీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో OBEN Rorr అనే బైక్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఇందులో ఉండే ఇంజన్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ బైక్ లో 4.4 kWh బ్యాటరీ ఉండనుంది. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 155 కిలోమీటర్ల మైలేజ్ ఎంత ఇస్తుంది. మూడు సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత . దీని ధర రూ.1.50 లక్షల తో విక్రయిస్తున్నారు
తక్కువ ధరలోనే స్పోర్ట్స్ బైక్ కావాలని అనుకునేవారు Revolt RV 400 బైక్ గురించి ఆలోచించాలి. ఇది స్ట్రీట్ ఫైటర్ లాగా కనిపిస్తుంది. ఈ బైక్ లో 3.24 kWh బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.1.50 లక్షల ప్రారంభం నుంచి విప్లయిస్తున్నారు. యూత్ కు అనుగుణంగా ఉండే ఈ బైక్ ఎక్కువగా విగ్రహాలు జరుపుకుంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడంలో ప్రత్యేకత సాధించుకుంది OLA కంపెనీ. ఈ కంపెనీకి చెందిన రోడ్ స్టర్ X Plus బైక్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో 9.1 kWh బ్యాటరీ కెపాసిటీ ఉండనుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. దీనిని రూ.1.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్స్ ఈ బైక్ లో ఉండడం విశేషం
Ultraviolate F77 Mach 2 రీకాన్ అనే బైక్ కూడా అత్యధిక విక్రయాలు జరుపుకుంటున్న లిస్టులో ఉంది. ఈ బైక్ ధర రూ.3.99 లక్షల లక్షలతో విక్రయిస్తున్నారు. దీనిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 323 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ ఇంజన్లో 40.2 బిహెచ్పి పవర్ అందిస్తుంది.
Ultraviolet x47 రీకాన్ అనే ఎలక్ట్రిక్ బైక్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం మార్కెట్లో ఈ ఐదు రకాల వాహనాలు ఆకట్టుకుంటున్నాయి.