Pawan Kalyan: కూరగాయల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్యడి జేబు గుల్ల అవుతోంది. ఓ వైపు నిత్యావసర ధరలు, మరోవైపు పెట్రో ధరలు, ఇప్పుడు కూరగాయల ధరలతో సగటు మనిషి మనుగడ ప్రమాదంలో పడిపోతోంది. బతుకు పోరాటంలో తన పర్సు ఖాళీ అయిపోతోంది. రోజు వారి సంపాదన దేనికి చాలుతుందని వాపోతున్నాడు. ధరలు ఇలా పెరిగితే ఎలా అని ఆందోళనలో పడిపోతున్నాడు. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై దుమారమే రేగుతోంది. పెద్ద సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. టికెట్ల విషయంలో తగ్గేదేలేదని చెబుతోంది. దీంతో సినిమా టికెట్ల వ్యవహారంలో నిర్మాతలకు తలనొప్పిగా మారుతోంది. ఎవరు కూడా బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో పెద్ద సినిమాల పరిస్థితి ఏంటనే విషయం ప్రధానంగా వినిపిస్తోంది.
గతంలో పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆయన సైతం పట్టించుకోలేదు. కిలో టమాట ధర రూ. 140 ఉండగా పవన్ కల్యాణ్ సినిమా టికెట్ ధర రూ. 100 ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలకున్న విలువ పవన్ కల్యాణ్ సినిమాకు లేదా అనే సంశయం అందరిలో వ్యక్తమవుతోంది.
Also Read: Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనా?
ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో సినిమా పరిశ్రమ కుదేలైపోతోందని విమర్శలు వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు. దీనికి గాను నిర్మాతల వైపు నుంచి ఆలోచించడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో అభాసుపాలవుతోంది. అయినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.
Also Read: Women Affire:భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?