https://oktelugu.com/

తెలంగాణాకి కేంద్ర బృందం కితాబు!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం 44 కేసులు, గురువారం 50 మందికి పాజిటివ్‌, శుక్రవారం ఏకంగా 66 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఇక్కడ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2020 11:44 am
    Follow us on

    తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం 44 కేసులు, గురువారం 50 మందికి పాజిటివ్‌, శుక్రవారం ఏకంగా 66 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

    ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఇక్కడ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది. ఆ బృందం సభ్యులు గాంధీ, ఛాతీ ఆస్పత్రులకు వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.

    వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, శుక్రవారం నాటికి 13 జిల్లాల్లో 209 కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇందులో తాజాగా 1,09,975 ఇళ్లకు వెళ్లి, 4,39,900 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.