తానేప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరెక్టర్ గా చూడలేదని కేవలం అభిమానిగానే చూశానని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తో తాను చేయబోయే మూవీపై ఆయన స్పందించారు. పవన్ తో చేసే సినిమా ఆయన అభిమానులను అలరించేలా ఉంటుందని తెలిపారు. ఈ మూవీ తర్వాత పవన్ అభిమానులు ఆయనను మరింతగా ఆరాధిస్తారని ఆయన తెలిపారు.
తాజాగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నిర్మాతలు మహేష్ ఎస్.కొనేరు, బన్నీ వాస్‌లతో కలిసి త్వరలో చిత్రాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో తన తదుపరి మూవీ పవన్‌తో కాకుండా మహేష్ ఉంటుందని హింట్ ఇచ్చారు. కాగా గతంలో పవన్-హరీష్ కాంబినేషన్లలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.
ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ మూవీని తెరెకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. త్వరలో పవన్ చేసే సినిమా పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఎన్ఆర్ఐ స్నేహితుల సహకారంతో పేదలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు సాయంచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు.
Also Read: మహేష్ కోసం కష్టపడుతోన్న హరీష్