ఫస్ట్ బ్లడ్ ఫేమ్ మూవీ స్టార్ బ్రేన్ డెన్నీ మృతి

హాలీవుడ్ లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. రీసెంట్ గా ఆండ్రూ జాక్ . హిల్లరీ హీత్ , అల్లెన్ ద్రావియా ,రిక్ మేరీ , టెరెన్స్ ఎంసీనాలీ వంటి పది మంది సీనియర్ నటులు ఒకరి తరవాత ఒకరు కరోనా ప్రభావం తో మరణించారు. విశేషం ఏమిటంటే వీరందరి వయసు 70 ఏళ్ళ పైమాటే ….ఇపుడు తాజాగా మరో సీనియర్ నటుడు కరోనా తో కన్నుమూశాడు .సుమారు 40 ఏళ్ళ నుంచి […]

Written By: admin, Updated On : April 18, 2020 11:52 am
Follow us on


హాలీవుడ్ లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. రీసెంట్ గా ఆండ్రూ జాక్ . హిల్లరీ హీత్ , అల్లెన్ ద్రావియా ,రిక్ మేరీ , టెరెన్స్ ఎంసీనాలీ వంటి పది మంది సీనియర్ నటులు ఒకరి తరవాత ఒకరు కరోనా ప్రభావం తో మరణించారు. విశేషం ఏమిటంటే వీరందరి వయసు 70 ఏళ్ళ పైమాటే ….ఇపుడు తాజాగా మరో సీనియర్ నటుడు కరోనా తో కన్నుమూశాడు .సుమారు 40 ఏళ్ళ నుంచి చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు హీరో బ్రేన్ డెన్నీ బుధవారం తన స్వగృహంలో కన్నుమూశారు. బ్రేన్ డెన్నీ 1938లో అమెరికాలోని కనెక్టికట్ లోని బ్రిడ్గ్ ఫోర్ట్ లో జన్మించాడు. ఈయన భార్య పేరు జెన్నిఫర్ కాగా వీరికి ఒక కొడుకు , కూతురు ఉన్నారు .

1982 లో విడుదలైన ఫస్ట్ బ్లడ్ చిత్రం లో హీరో సిల్వెస్టర్ స్టాలిన్ కి గురువు షెరీఫ్ విలియం గా అద్భుత నటనతో ప్రపంచాన్ని కట్టిపడేసాడు. బ్రేన్ డెన్నీ నటుడి గా 40 ఏళ్లలో సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా కనిపించాడు. 1985లో వచ్చిన స్కిఫికాకూన్ సినిమాలో ఏలియన్స్ లీడర్‌గా కనిపించి మెప్పించాడు 1996లో రోమియో జూలియట్ సినిమాలో రోమియో తండ్రిగా నటించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కాగా బ్రేన్ డెన్నీ మరణం కరోనా వల్ల కాదని ఈయన కూతురు అందరి అనుమానం నివృత్తి చేసింది 82 ఏళ్ళ .బ్రేన్ డెన్నీ గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో వైద్యుల వద్ద చికిత్స పొందుతూ మరణించి నట్టు తెలుస్తోంది .