Girl Savings Plan : బ్యాంకులలో అలాగే పోస్ట్ ఆఫీస్ లలో కూడా సామాన్య ప్రజలకు కూడా అనేక పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ హామీతో ఉండే ఈ పథకాలలో మీరు ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో ఆడపిల్లల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న ఒక గొప్ప పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన. ప్రతి తల్లిదండ్రులు కూడా తమకు ఆడపిల్ల పుట్టిన దగ్గరనుంచి ఆమె భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించడంతోపాటు వాళ్లను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి అలాగే ఆమె పెళ్లి ఘనంగా చేయడానికి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు చిన్న చిన్న మొత్తం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఈ రోజులలో తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొని వచ్చింది. ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరు చిన్న మొత్తంలో పొదుపు ప్రారంభించి దీర్ఘకాలంలో మీరు భారీ మొత్తంలో పొందవచ్చు. మెచ్యూరిటీ సమయానికి వచ్చే ఈ భారీ రాబడి మీ కూతురు ఉన్నత చదువులకు లేదా ఆమె పెళ్లి ఖర్చులకు ఎంతగానో సహాయపడుతుంది.
ఆడపిల్లల విద్య మరియు వివాహం కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొందించబడిన ఒక చిన్న పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన పథకం. అన్ని పోస్ట్ ఆఫీసులు అలాగే బ్యాంకులలో ఈ పథకం నిర్వహించబడుతుంది. ఈ పథకం కింద పొదుపు చేసిన వారికి ప్రస్తుతం 8.20% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకానికి చక్రవడ్డీ కూడా వర్తిస్తుంది. వార్షిక ప్రాతిపదికన మీరు పెట్టిన పెట్టుబడికి వడ్డీని లెక్కిస్తారు. పదేళ్ల లోపు ఉన్న ఆడపిల్లలు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం ఖాతాను తెరవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో మీరు కనీసం 250 రూపాయలు కట్టి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో 1.50 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.
Also Read : ఆడబిడ్డ నిధి పథకం.. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో నెల నెల రూ.1500.. వెంటనే అప్లై చేసుకోండి..
మీరు ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయడం మీకు కొంచెం సులభంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ పథకానికి 15 ఏళ్ళు లాక్ ఇన్ పిరియడ్ సమయం ఉంటుంది. 15 ఏళ్ల పాటు మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీ ఆడపిల్లకు 18 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఇందులో నుంచి 50% డబ్బును ఉపసంహరించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయానికి అంటే 21 ఏళ్లు పూర్తయిన తర్వాత మీరు మీ ఆడపిల్లకు 18 ఏళ్లు నిండి ఉంటే ఆమె వివాహం కోసం ఈ ఖాతాను మూసి వేయవచ్చు. 8.20% వడ్డీ రేటు తో మీరు 15 ఏళ్ల పాటు ఇందులో పెట్టుబడి చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ సమయానికి వడ్డీతో కలిపి మొత్తం రూ.69,27,578. మీరు పెట్టిన పెట్టుబడి రూ.22,50,000, ఇక వడ్డీ రూ.46,77,578.