Girl Child Fund : ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతాలోకి పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి పై ఒక కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం డైరెక్ట్గా ప్రతి మహిళకు ప్రతినెల 1500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో వేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పేరుతో ఒక ప్రత్యేక పథకం ప్రభుత్వం త్వరలో తీసుకొని రానుందని వివరించారు. ముఖ్యమంత్రి చెప్పిన వివరాల ప్రకారం ఈ పథకం కింద ప్రతి నెల ప్రతి మహిళ నెలకు 1500 రూపాయల చొప్పున అందుకోవచ్చు. అంటే ఏడాదికి 18 వేల రూపాయలు మహిళలలు అందుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని ఉంది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకాన్ని త్వరలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఈ సమాజాన్ని కరుణతో మార్చడమే మారుతున్న లక్ష్యం రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రత్యేక భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం చాలా దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ తరహా పథకాలు ఇతర రాష్ట్రాలలో లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డల కోసం ముందుగానే ఈ పథకం మహిళలకు ఆర్థిక బలాన్ని కల్పిస్తుందని సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా త్వరలోనే ఏపీ రాష్ట్రంలో మహిళలకు కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చు.