CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే అది బిజెపి, జనసేన లతో స్ట్రాంగ్ బంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ జపం పఠిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చంద్రబాబు ఎక్కువగా సేఫ్ జోన్ చూస్తుంటారు. సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఎన్నికల సమయంలో లాభనష్టాలు బేరీజు వేసుకొని అడుగులు వేస్తుంటారు. అందుకే 2024లో హిట్ అయిన కాంబినేషన్ కొనసాగాలని కోరుకుంటున్నారు. మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ కావడంతోనే చంద్రబాబు.. 2029 లోను ఇదే రిపీట్ చేయాలని భావిస్తున్నారు.
Also Read: అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!
* అప్పట్లో చంద్రబాబు మూల్యం..
2018లో ఎన్డీఏ( NDA) నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారు. మోడీ ఆగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు. గత ఐదేళ్లలో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. అందుకే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ప్రధాని మోదీని అనుసరిస్తున్నారు. వాస్తవానికి మోడీ చంద్రబాబు కంటే జూనియర్. ఈ విషయాన్ని చంద్రబాబు చాలా సార్లు చెప్పుకొచ్చారు కూడా. అయితే ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ సంక్లిష్ట పరిస్థితి దృష్ట్యా కేంద్రంతో ముందుకెళ్లాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది.
* కేంద్రం పట్ల అదే భావం..
కేంద్ర ప్రభుత్వాన్ని( central government) ఏ విషయంలో కూడా చంద్రబాబు ప్రశ్నించడం లేదు. వీలైనంతవరకు విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు. హిందీని రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండడం పై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో నోరు మెదపడం లేదు.
* పవన్ పై రాజకీయ ఉదారత..
ఏపీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) విషయంలో చంద్రబాబు ఎన్నడూ చూపని రాజకీయ ఉదారత చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో పెట్టించారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఒక రకమైన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ను ప్రాధాన్యం ఇస్తే సరిపోతుందా.. తమ పరిస్థితి ఏంటని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇస్తే.. ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. ఇంకోవైపు బిజెపి సైతం తమకు మరో మంత్రి పదవి కావాలని కోరుకుంటుంది. అయితే చంద్రబాబుకు ఇవేవీ కనిపించడం లేదు.. ఇవేవీ వినిపించడం లేదు. ఆయన దృష్టి అంత 2029 ఎన్నికలపైనే ఉంది.
Also Read: మహిళలకు ఎస్‌బీఐ కానుక.. మహిళా దినోత్సవంగా స్పెషల్ స్కీంలు..