హైదరాబాద్‌ను వదులుకున్నందుకు రూ.1400 కోట్లు

ఎన్నో ఉద్యమాల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అదే ఉద్యమ సమయంలో హైదరాబాద్‌పై ఓ ప్రతిష్టంభన సైతం నెలకొని ఉంది. ముందు నుంచీ హైదరాబాద్‌ తెలంగాణదే అని.. ఇక్కడి ప్రజలు వాదిస్తుంటే.. లేదులేదు ఉమ్మడి రాజధాని చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ లీడర్లు డిమాండ్‌ చేశారు. చివరకు ఏపీకి కొత్త రాజధాని ఫౌండేషన్‌ అయ్యే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించినా.. చివరకు తెలంగాణ చేతుల్లోకే వెళ్లిపోయింది హైదరాబాద్‌. అయితే.. నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఓ ఆసక్తికర […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 12:30 pm
Follow us on


ఎన్నో ఉద్యమాల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అదే ఉద్యమ సమయంలో హైదరాబాద్‌పై ఓ ప్రతిష్టంభన సైతం నెలకొని ఉంది. ముందు నుంచీ హైదరాబాద్‌ తెలంగాణదే అని.. ఇక్కడి ప్రజలు వాదిస్తుంటే.. లేదులేదు ఉమ్మడి రాజధాని చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ లీడర్లు డిమాండ్‌ చేశారు. చివరకు ఏపీకి కొత్త రాజధాని ఫౌండేషన్‌ అయ్యే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించినా.. చివరకు తెలంగాణ చేతుల్లోకే వెళ్లిపోయింది హైదరాబాద్‌. అయితే.. నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

Also Read: వరంగల్‌లో రాజుకుంటున్న వివాదం.. : నేడు టీఆర్‌‌ఎస్‌, రేపు బీజేపీ ఆందోళనలు

కేంద్ర బడ్జెట్‌తోపాటు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఈ సారి కొత్తగా కనిపించి హైలెట్ అయిన అంశం హైదరాబాద్‌ను కోల్పోయినందుకు ఏపీకి రూ.1,400 కోట్లు అదనంగా కేటాయించడం. హైదరాబాద్‌లా విశాఖను అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాల కింద రూ.1,400 కోట్లు కేటాయించాలని ఏపీ సర్కార్ కోరడం.. దానికి ఆర్థిక సంఘం ఆమోదించడం జరిగిపోయాయి. అంటే.. ఐదేళ్ల కాలంలో విశాఖకు రూ.1,400 కోట్లు వస్తాయి. ఎందుకంటే.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడం. నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చుకోవాలంటే రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి నిధులు కావాలని కోరింది.

Also Read: బీజేపీ పట్ల టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: అందుకే ఈ దాడులా..?

అయితే.. హైదరాబాద్‌లాంటి నగరాన్ని వదులుకున్నందుకు రూ.1,400 కోట్లే కదా కోరుతోంది అని ఆర్థిక సంఘం కూడా ఐదేళ్లలో ఇవ్వాలని సిఫార్సు చేసింది. అంటే ఏడాదికి మూడు వందల కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ఎంచుకుంది. అదే విషయాన్ని ఆర్థిక సంఘానికి చెప్పి.. అత్యదిక నిధులు ఆ నగారానికి మంజూరయ్యేలా సిఫార్సులు చేసింది. ప్రభుత్వాలు చేసే సిఫార్సులన్నీ కాకపోయినా వాటి సైజును బట్టి కొన్నింటినీ ఆర్థిక సంఘం ఆమోదిస్తుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

మరికొన్నింటిని మాత్రం ఖచ్చితంగా ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అలా పట్టుబట్టి మరీ.. విశాఖకు నిధులు కేటాయించేలా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు హైదరాబాద్‌ను కోల్పోయినందుకు అనే మాటను ఆర్థిక సంఘం ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్న. విభజన లెక్కల ప్రకారం.. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అక్కడి ఆస్తులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉంటుంది. పదేళ్ల తర్వాత ఉమ్మడి ఆస్తుల్లో సగం ఏపీకి దక్కాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు హైదరాబాద్‌పై ఏపీ పూర్తిస్థాయిలో హక్కులు వదిలేసుకున్నట్లుగా ఉందన్న చర్చ కూడా నడుస్తోంది.