https://oktelugu.com/

వరంగల్‌లో రాజుకుంటున్న వివాదం.. : నేడు టీఆర్‌‌ఎస్‌, రేపు బీజేపీ ఆందోళనలు

అయోధ్య రామమందిరం నిర్మాణానికి బీజేపీ విరాళాల సేకరణ తెలంగాణ రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. ఈ విరాళాల సేకరణపై వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఏకంగా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. అలాగే.. టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ లీడర్ల ఇళ్లపై దాడులకు దిగారు. అయితే.. టీఆర్ఎస్–బీజేపీ దాడుల రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. Also Read: బీజేపీ పట్ల టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2021 / 12:15 PM IST
    Follow us on


    అయోధ్య రామమందిరం నిర్మాణానికి బీజేపీ విరాళాల సేకరణ తెలంగాణ రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. ఈ విరాళాల సేకరణపై వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఏకంగా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. అలాగే.. టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ లీడర్ల ఇళ్లపై దాడులకు దిగారు. అయితే.. టీఆర్ఎస్–బీజేపీ దాడుల రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

    Also Read: బీజేపీ పట్ల టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: అందుకే ఈ దాడులా..?

    ఇందులో భాగంగా సోమవారం అంతా టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా ఆయన నియోజకవర్గం పరకాలలో బంద్ పాటించారు. వరంగల్ జిల్లాలో పలుచోట్ల నిరసనలు చేపట్టారు. రాత్రి అంతా బీజేపీ నేతల ఇళ్లపై వరుస దాడులు జరిగాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

    Also Read: కేంద్రబడ్జెట్: ఏపీకి వరం.. తెలంగాణకు శాపం

    దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తమ జోలికి వస్తే ఊరుకోబోమని.. తాము అధికార పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇదే ఎఫెక్ట్ కోసం బీజేపీ నేతలు చూస్తున్నట్లుగా ఉంది. టీఆర్ఎస్ నేతల్ని వీలైనంతగా రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. తమ నేతలపై దాడులు చేస్తున్నారని.. ఆపకపోతే ఊరుకోబోమని అంటున్నారు. అయోధ్య విరాళాల అంశం సున్నితమైనది కావడంతో బీజేపీ నేతలు దీన్ని మరింత పెద్దది చేయాలనుకుంటున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    రామాలయం నిర్మాణంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు ఈ విరాళాల సేకరణ చేపడుతున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలోనే రామాలయ నిర్మాణానికి కేసీఆర్‌‌ అనుకూలమా కాదా అన్న వాదనను ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకొస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాము రాముడి ఆలయానికి వ్యతిరేకం కాదని.. బీజేపీ నేతల దందాకే వ్యతిరేకమని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో వరంగల్ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని కొనసాగించాలనే వ్యూహంతోనే బీజేపీలో ఉందని తెలుస్తోంది.