నార్త్‌ వర్సెస్‌ సౌత్‌.. : దక్షిణాది ఉద్యమం తప్పదా

‘దక్షిణాది నుంచి వసూలు చేయడం.. ఉత్తరాదికి పెట్టడం..’ ఇదీ ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో వినిపిస్తున్న విమర్శలు. అవును నిన్నటి కేంద్ర బడ్జెట్‌ చూసిన ఎవరికైనా అదే అర్థమవుతోంది కూడా. పెద్ద ఎత్తున నిధులు.. ఉత్తరాది రాష్ట్రాలకే ధారబోసారు. ఎన్నికలున్న కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొన్ని నిధులు ప్రకటించారు. కానీ.. గత చరిత్ర చూస్తే కేటాయింపులు పూర్తిగా ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. దీంతో దక్షిణాది ఎంపీల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఈ నిరాదరణ ఇంకెంత కాలం […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 12:43 pm
Follow us on


‘దక్షిణాది నుంచి వసూలు చేయడం.. ఉత్తరాదికి పెట్టడం..’ ఇదీ ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో వినిపిస్తున్న విమర్శలు. అవును నిన్నటి కేంద్ర బడ్జెట్‌ చూసిన ఎవరికైనా అదే అర్థమవుతోంది కూడా. పెద్ద ఎత్తున నిధులు.. ఉత్తరాది రాష్ట్రాలకే ధారబోసారు. ఎన్నికలున్న కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొన్ని నిధులు ప్రకటించారు. కానీ.. గత చరిత్ర చూస్తే కేటాయింపులు పూర్తిగా ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. దీంతో దక్షిణాది ఎంపీల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఈ నిరాదరణ ఇంకెంత కాలం అన్న చర్చ కూడా నడుస్తోంది.

Also Read: కేంద్రబడ్జెట్: రాహుల్ కు హెడ్డేక్.. మీమ్స్ వైరల్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ అంశంపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. జమిలీ ఎన్నికలు పెట్టి.. అధ్యక్ష పద్ధతిలోకి మార్చాలనుకున్న వ్యూహం బడ్జెట్‌లో కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. ఒకవేళ జమిలీ ఎన్నికలే జరిగితే.. దేశం రెండుగా విడిపోవడం ఖాయమని.. అదే జరిగితే అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం పడవని అంటున్నారు. జమిలి ఎన్నికలు జరగగానే .. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు.

Also Read: సామాన్యుడిని పీల్చిపిప్పి చేసే బడ్జెట్ ఇదీ

రేవంత్‌ చెప్పినట్లుగా అదే జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందనేది వాస్తవం. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని.. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని గుర్తుచేశారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాలేనని.. కానీ నిధులు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని లెక్కలు చెప్పారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్న మోడీ జమిలీ ఎన్నికల ఆలోచనను సైతం విరమించుకోవాలని.. లేదంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడుతానని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్‌లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదని.. గతంలో బీహార్‌‌కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు.. ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. రేవంత్‌తోపాటు మరికొంత మంది ఎంపీల అభిప్రాయం కూడా అంతే ఉంది. నియామకాలు.. నిధుల్లో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది ప్రజలు ఏకం అయ్యే పరిస్థితి ఉందా..? ఉన్నా తిరుగుబాటు చేయగలరా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.