https://oktelugu.com/

సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో..

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలను డ్రగ్స్‌ రాకేట్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ర్టీల్లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం కేసులోనూ ఈ డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ఈ డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది. దీంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగి ఇప్పటికే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అరెస్టు చేశారు. Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 01:15 PM IST
    Follow us on

    కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలను డ్రగ్స్‌ రాకేట్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ర్టీల్లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం కేసులోనూ ఈ డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ఈ డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది. దీంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగి ఇప్పటికే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అరెస్టు చేశారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై బాలీవుడ్ భామ చిన్నచూపు?

    అయితే.. రియా చక్రవర్తికి ఎట్టకేలకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ప్రతి పదిరోజులకోసారి సమీప పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని షరతులు విధించింది. ఈ కేసులు అరెస్టైన శామ్యూల్‌ మిరండా, దిపేశ్‌ సావంత్‌కు కూడా బెయిల్‌ వచ్చింది. అయితే.. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి మాత్రం బెయిల్‌ దొరకలేదు.

    బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ జూన్‌ 14న  అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆ కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారించారు. ఇందులో భాగంగా సుశాంత్‌తో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్కరినీ ఎన్సీబీ అధికారులు విచారించారు.

    Also Read: రచ్చ.. రచ్చ.. అరియానాకు ముద్దు ఇచ్చిన అవినాష్..!

    డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించారు ఎన్సీబీ అధికారులు. బాలీవుడ్‌తోపాటు ఆయా సినీ ఇండస్ట్రీల వారిని కూడా వేర్వేరుగా విచారించారు. బాలీవుడ్‌ నుంచి దీపికా పదుకొనే, సారా ఆలీ ఖాన్, శ్రద్ధాకపూర్, టాలీవుడ్‌కు చెందిన రకుల్‌ను విచారించారు