spot_img
Homeఆంధ్రప్రదేశ్‌పార్లమెంట్ సాక్షిగా ఏపీకి కేంద్రం హామీ

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి కేంద్రం హామీ

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో విభజన హామీలో భాగంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు  జాతీయ హోదా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకురుస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించి పనులను వేగవంతం చేసింది.

Also Read: అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?

కరోనా ఎఫెక్ట్ తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొంత ఆలస్యం అవుతోంది. ఏపీలో కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా వస్తే పనులు మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నేడు రాజ్యసభలో జీరో అవర్లో ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం త్వరలోనే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. త్వరలోనే మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించాలని సీఎం జగన్మోహన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,805కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు.

Also Read: మరణించినా ‘కోడెల’ను వదలవా జగన్?

కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. పోలవరాన్ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించి ముందుకెళుతున్నారు.. ఇక త్వరలోనే కేంద్రం పోలవరం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఏపీకి కేంద్రం నుంచి నిధులు వస్తే పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకునేలా కన్పిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper