కరోనా వేళ కేంద్రం మరో ప్యాకేజీ?

కరోనా వేళ ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయిపోతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికి వివిధ దేశాలు ఏదో విధంగా ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తుంటాయి. కానీ మన దేశం మాత్రం సామాన్యుడి నడ్డివిరిచే పని చేస్తున్నాయి తప్ప ఒరిగేదేమి లేదు. మొదటి విడత లాక్ డౌన్ లో కేంద్రం మనకు ఎన్నో రకాల ప్యాకేజీలు ఇచ్చినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు . దీంతో సగటు పౌరుడికి నిరాశే మిగులుతోంది. […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 6:20 pm
Follow us on


కరోనా వేళ ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయిపోతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికి వివిధ దేశాలు ఏదో విధంగా ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తుంటాయి. కానీ మన దేశం మాత్రం సామాన్యుడి నడ్డివిరిచే పని చేస్తున్నాయి తప్ప ఒరిగేదేమి లేదు. మొదటి విడత లాక్ డౌన్ లో కేంద్రం మనకు ఎన్నో రకాల ప్యాకేజీలు ఇచ్చినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు . దీంతో సగటు పౌరుడికి నిరాశే మిగులుతోంది.

కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించబోతోంద. రెండో దశ కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి కేంద్రం ప్యాకేజీ ఇస్తే సంతోషపడాలి కానీ మోదీ సర్కారు ప్యాకేజీ అంటే భయపడడమే. ప్రజలకు పైసా ఇవ్వకపోగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.

కరోనా వేవ్ మొదటి దశలో లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఆదుకోవడానికి రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తరువాత కామ్ గా ఉండిపోయారు. ప్యాకేజీ కారణంగా పెట్రోల్ ధరలను రూ.70 నుంచి రూ.100కు ఏడాదిలోనే తెచ్చేశారు. కానీ ప్యాకేజీ మాత్రం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. సామాన్యుడికి మాత్రం ఏ లాభం చేకూరలేదు. ఇరవై కో ట్ల ప్యాకేజీ ఇస్తున్నారా అని సోషల్ మీడియాలో పోస్టులు పేలినా సమాధానం మాత్రం చెప్పలేదు. దీంతో రెండో దశ లాక్ డౌన్ ప్రకటించకపోయినా ప్యాకేజీ ఇస్తామని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇతర దేశాల్లో ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు పరిహారాలు అంజేస్తాయి. కానీ ఇండియాలో మాత్రం రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇరవై కోట్ల ప్యాకేజీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. ప్రస్తుతం కరోనా వేళ కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటిస్తుందని చెప్పడంతో సామాన్యుడే షాకవుతున్నాడు. ఏ ప్యాకేజీ అయినా సగటు పౌరుడికి ఒరిగేమీ ఉండదని నివ్వెరపోతున్నాడు.