https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : సీతగా కరీనా కపూర్ రావణుడిగా రణవీర్ !

‘బాహుబలి’తో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘భజరంగి భాయ్ జాన్’, ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలతో ఆయన రైటర్ గా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర రచయితగా కూడా కొనసాగుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన నుండి మరో హిందీ సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే ‘సీత’. ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ఆలోచనతో ఓ పౌరాణిక చిత్రాన్ని విజయేంద్ర […]

Written By:
  • admin
  • , Updated On : May 25, 2021 / 05:51 PM IST
    Follow us on


    ‘బాహుబలి’తో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘భజరంగి భాయ్ జాన్’, ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలతో ఆయన రైటర్ గా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర రచయితగా కూడా కొనసాగుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన నుండి మరో హిందీ సినిమా రాబోతుంది.

    ఆ సినిమా పేరే ‘సీత’. ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ఆలోచనతో ఓ పౌరాణిక చిత్రాన్ని విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ చేశాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారని తెలుస్తోంది. కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రేయేటివిటి పార్ట్ కి సంబందించిన పని అంతా ఆయనే చూసుకుంటారని, అవసరం అయితే డైరెక్షన్ కూడా చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది.

    ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేయకపోతే వేరే ఎవరినైనా డైరెక్టర్ గా పెట్టుకుంటారట. ఇంతకీ సీతగా ఎవరు నటించబోతున్నారో తెలుసా.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్. నిజంగా కరీనా సీతగా అద్భుతంగా ఉంటుంది.

    ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. రణవీర్ సింగ్ ని రావణుడి పాత్రకి అడిగారని, దానికి రణవీర్ సింగ్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది.