https://oktelugu.com/

కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..!

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గజగజ వణికిపోతుంది. ఈ ఏడాది తొలినాళల్లో చైనాలో వెలుగుచూసిన ఈ కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. మార్చి నెలలో భారత్ లోకి కోవిడ్-19 ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఈనేపథ్యంలోనే కేంద్రం కొన్ని షరతులతో సడలింపులు ఇస్తోంది. ప్రస్తుతం ఆన్ లాక్ 5.0 కొనసాగుతోంది. Also Read: ఆ అకౌంట్లోకి మోడీ రూ.3,000 గిప్ట్.. అసలు క్లారిటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 7:33 pm
    Follow us on

    కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గజగజ వణికిపోతుంది. ఈ ఏడాది తొలినాళల్లో చైనాలో వెలుగుచూసిన ఈ కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. మార్చి నెలలో భారత్ లోకి కోవిడ్-19 ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఈనేపథ్యంలోనే కేంద్రం కొన్ని షరతులతో సడలింపులు ఇస్తోంది. ప్రస్తుతం ఆన్ లాక్ 5.0 కొనసాగుతోంది.

    Also Read: ఆ అకౌంట్లోకి మోడీ రూ.3,000 గిప్ట్.. అసలు క్లారిటీ ఇది..!

    ఆన్ లాక్ 5.0 అమలు నాటికి దాదాపు దేశంలోని ఒకటి.. అర మినహా అన్నిరంగాలు తెరుచుకున్నాయి. ఇక భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ తయారీ వేగవంతంగా జరుగుతోంది. భారత్ చేపడుతున్న ప్రయోగాలు చివరిదశకు చేరుకోవడంతో కేంద్రం అప్రమత్తం అయింది. దేశంలోని ప్రజలందరి అవసరాలకు తగ్గట్టు కరోనా వాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచేలా సన్నహాలు చేపడుతోంది. ఈమేరకు ఔషధ తయారీ సంస్థలకు కేంద్రం తగు ఆదేశాలు జారీ చేసింది.

    కరోనా నివారణకు అవసరమైతే నిత్యావసరాల చట్టం.. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్.. విపత్తు నిర్వహణ చట్టం ఆధారంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనిప్రకారంగా ఉత్పత్తి సంస్థకు చెందిన పూర్తి నిల్వలు లేదా కొంత మొత్తం కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే విక్రయించాలనే నిబంధన విధించే అధికారం ఉంది. దీంతోపాటు టీకా ధరలను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మేరకు అధికారులను.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.

    కరోనా వాక్సిన్ దేశీయ అవసరాలకు సరిపడా ఉంచాలని ఔషధ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దేశంలో వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉంచిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాకు ముందుగా ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఆ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఇప్పటికే ఫార్మా కంపెనీలను ఆదేశాలు జారీ చేసింది.

    Also Read: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

    కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసే సామర్థ్యం ఒక భారత్ వద్దే ఉంది. అందరికీ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచడంలో భారత్ పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే భారత్ వాక్సిన్ల తయారీ ఖర్కానాగా గుర్తింపు పొందింది. పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక్కటే 400నుంచి 500మిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలదని అంచనా.

    నెలకు 200 మిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం భారత్ కు ఉందని విశ్లేషిస్తున్నారు. కరోనా వాక్సీన్ తయారీలో భారత్ పెద్దన్న పాత్రో పోషిస్తుందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. ఆ దిశగా భారత్ తన సత్తా ప్రపంచానికి చూపించేందుకు ఉవ్విళ్లురుతోంది.