https://oktelugu.com/

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య 8లక్షలు దాటిపోయింది. వైరస్ తీవ్ర రోపం దాల్చుతున్నప్పటికీ దేశ ఆర్థిక రంగం దెబ్బతినకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రజలే స్వఛ్చందంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని కోరుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సైతం కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య 23,814కి చేరుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 2:22 pm
    Follow us on


    దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య 8లక్షలు దాటిపోయింది. వైరస్ తీవ్ర రోపం దాల్చుతున్నప్పటికీ దేశ ఆర్థిక రంగం దెబ్బతినకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రజలే స్వఛ్చందంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని కోరుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సైతం కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య 23,814కి చేరుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కారణంగా 277 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఆంద్రప్రదేశ్ లో కరోనా మృతుల ఖననం విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

    విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

    కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి మృత దేహాలను, నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున రాత్రిపూట జేసీబీ సాయంతో పూడ్చివేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన రోగుల శవాలను అంబులెన్సులో పెన్నానది తీరానికి తరలించి, జేసీబీ లోడింగ్ బకెట్ లో శవాలను పేర్చి, నేరుగా గుంటలోవేసి ఖననం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పుటేజ్ బయటికి రావడంతో ఈ దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. మరణించిన వారి పట్ల కనీస గౌరవం లేకుండా జేసీబీతో ఖననం చేయడం ఏమిటని, మీడియా మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని మరియు సిబ్బందిని తప్పుబడుతున్నారు.

    ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

    జాతీయ స్థాయిలో ఈ సంఘటన చర్చకు దారితీసింది. జాతీయం మీడియా సైతం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. గతంలో సైతం శ్రీకాకుళం జిల్లాలో కరోనా సోకి మరణించిన ఓ వృద్ధుడి శవాన్ని వైద్య సిబ్బంది జేసీబీ లో తరలించడం విమర్శలకు దారితీసింది. దీనితో టీడీపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరుపై దాడికి దిగింది. మరలా అలాంటి సంఘటనే పునరావృతం కావడంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కరోనా టెస్టులు నిర్వహణలో భేష్ అనిపించుకున్న జగన్, వైద్య సిబ్బంది నిర్వాకం వలన జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతున్నారు. ఇకనైనా జగన్ ఈ విషయంపై దృష్టిపెట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసుకోకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.