జగన్ కు కోర్టు నోటీసులు.. ఏం జరుగనుంది?

ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ పై దాదాపు 10 వరకు గట్టి కేసులున్నాయి. అయితే కేంద్రంలోని బీజేపీతో సయోధ్యతో ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆ కేసులను వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు బయటకు తీస్తున్నాడు. జగన్ ఒక రాష్ట్రం సీఎం హోదాలో ఉండి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల […]

Written By: NARESH, Updated On : April 29, 2021 9:23 am
Follow us on

ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ పై దాదాపు 10 వరకు గట్టి కేసులున్నాయి. అయితే కేంద్రంలోని బీజేపీతో సయోధ్యతో ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆ కేసులను వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు బయటకు తీస్తున్నాడు. జగన్ ఒక రాష్ట్రం సీఎం హోదాలో ఉండి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడదే జగన్ కొంప ముంచేలా ఉందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురించిన జగన్ పై నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు చేత హైకోర్టుకు లేఖ రాయించి అక్రమాస్తుల కేసుల్లో ఇరికించేలా చేసింది సోనియా, కాంగ్రెస్ నేతలు అని ప్రచారం ఉంది. ఇప్పుడు దాదాపుగా స్తబ్దుగా మారిన జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ నుంచే గెలిచి జగన్ కు పక్కలో బల్లెంలా మారిన రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టుకు ఎక్కడం కాకరేపుతోంది. రఘురామ పిటీషన్ ను విచారణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు తాజాగా ఈరోజు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేయడం పెను సంచలనమైంది. రఘురామ వేసిన పిటీషన్ పై వివరణ ఇవ్వాలని జగన్ కు, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.ఇక ఈ పిటీషన్ పై వచ్చే నెల7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? జగన్ కు ముప్పు వాటిల్లుతుందా? అన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

ఇదివరకే ఒకసారి జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటీషన్ వేస్తే సరిగా లేదని సీబీఐ కోర్టు  వెనక్కి పంపింది.   ఇప్పుడు మరోసారి ఎంపీ రఘురామ పక్కాగా పిటీషన్ తో కోర్టును ఆశ్రయించారు. ట్విస్ట్ ఏంటంటే ఈసారి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది. జగన్ సీఎంగా ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ స్వీకరించిన కోర్టు దీనిపై సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు ఇవ్వనుంది.

జగన్ బెయిల్ కనుక రద్దు చేస్తే జగన్ కుర్చీ గల్లంతవ్వడం ఖాయం. మరి ఈ విషయంలో కోర్టు ఏం నిర్ణయిస్తుంది? జగన్ పదవికి ఎసరొస్తుందా? అన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ శ్రేణులకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రశాంతంగా పాలిస్తున్న జగన్ కు ఈ పరిణామం ఒకింత కలవరపాటుకు గురిచేసేలానే ఉంది. ఎంపీ రఘురామ పేరు చెబితేనే వైసీపీ శ్రేణులు ఊగిపోతున్న పరిస్థితి నెలకొంది.