https://oktelugu.com/

జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

ఏపీ-తెలంగాణ జలవివాదం ప్రజలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారేమో కానీ ఇద్దరు మాత్రం ఇంకా తమ పంతం నెగ్గించుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. వారు ఎవరో కాదు… ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఒకరితో ఒకరికి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల గొడవలు వచ్చేశాయి. ఇక తన రాష్ట్రం విషయంలో కేసీఆర్ కు ఎంతటి ప్రత్యేక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 20, 2020 / 09:06 PM IST
    Follow us on

    ఏపీ-తెలంగాణ జలవివాదం ప్రజలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారేమో కానీ ఇద్దరు మాత్రం ఇంకా తమ పంతం నెగ్గించుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. వారు ఎవరో కాదు… ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఒకరితో ఒకరికి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల గొడవలు వచ్చేశాయి. ఇక తన రాష్ట్రం విషయంలో కేసీఆర్ కు ఎంతటి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు సైతం ఇలాంటి వైఖరి ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోవడమే ఇప్పుడు ఇంత పెద్ద సమస్యకు దారి తీసింది.

    Also Read : న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి

    మామూలుగా చూస్తే ఇప్పుడు జగన్ ది కొద్దిగా పైచేయి అనిపిస్తుంది కేసీఆర్ సై అంటే జగన్ సై అనడం తోనే జగన్ తొలిమెట్టు ఘనంగా ఎక్కాడని పలువురు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 25న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు ఏపీ సర్కారు చేసిన తప్పులను ఎత్తిచూపాలన్న విషయాన్ని అధికారులకు సీఎం కేసీఆర్ క్లియర్ గా చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చేసాయి. కమిటీ భేటీ సందర్భంగా రాష్ట్ర అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

    తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ రీ-డిజైన్ చేసినవే తప్ప కొత్తగా తెరమీదకు తీసుకువచ్చినవి ఏవీ లేవని బలంగా చెప్పడమే కాదు కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బట్టబయలు చేయాలన్న కోపంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కనుక జరిగితే జగన్ తెలంగాణ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలన్నీ నీరుగారిపోతాయి. వెంటనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు తో పాటు ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన గట్టి అభ్యంతరాలు చెప్పాలి అన్న విషయాన్ని అధికారులకు కెసిఆర్ స్పష్టం చేశాడు. ఇక అందుకు సరైన కౌంటర్ ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసుకోకపోతే కెసిఆర్ ప్లాన్ కు జగన్ బలి అయిపోవడం ఖాయం అన్నది విశ్లేషకుల అంచనా.

    Also Read : మోడీ గడ్డం వెనుక ఇంత పెద్ద కథ ఉందా?