https://oktelugu.com/

Caste Based Politics: ఇద్దరు వైసీపీ కమ్మ నాయకులపై 50 లక్షల రివార్డ్ ప్రకటించిన ఒక కమ్మ వ్యక్తి

Caste Based Politics: ఏపీ రాజకీయాలు మొత్తం కులాన్ని బేస్ చేసుకునే ముందుకు సాగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఏపీలోని బడా నేతలు కులానికి ప్రాధాన్యం ఇస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కులాల మధ్య చిచ్చు.. కుల నేతలపై విమర్శలు చేస్తూ వాళ్లువాళ్లు కొట్టుకు చస్తుంటే అధికారంలో ఉన్నవాళ్లు సినిమా చూసినట్లు చూస్తుంటారు. వీరికి అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో ఇలాంటి సంఘటనలు ఏపీలో కామన్ అయిపోయాయి. వైసీపీ సర్కారు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 / 12:19 PM IST
    Follow us on

    Caste Based Politics: ఏపీ రాజకీయాలు మొత్తం కులాన్ని బేస్ చేసుకునే ముందుకు సాగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఏపీలోని బడా నేతలు కులానికి ప్రాధాన్యం ఇస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కులాల మధ్య చిచ్చు.. కుల నేతలపై విమర్శలు చేస్తూ వాళ్లువాళ్లు కొట్టుకు చస్తుంటే అధికారంలో ఉన్నవాళ్లు సినిమా చూసినట్లు చూస్తుంటారు. వీరికి అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో ఇలాంటి సంఘటనలు ఏపీలో కామన్ అయిపోయాయి.

    YSRCP and TDP

    వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇదికాస్తా కొంచెం ముదిరిపోయినట్లు కన్పిస్తుంది. వైసీపీ నేతలు కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయా కులాలు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులు, అవమానకరమైన రీతిలో మాట్లాడుతుండటంతో ఆయా కులాలు సైతం వైసీపీ నేతల పని పట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

    ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడి వైసీపీ నేతలు అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన కులానికి చెందిన నేతలు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం శోచనీయంగా మారగా దీనిని కొందరు నేతలు సీరియస్ గా తీసుకున్నట్లు కన్పిస్తోంది. కొద్దిరోజులు వైసీపీ నేతలు కొన్ని కులాలను కార్నర్ చేస్తుండటంతో వారంతా వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఏపీలో జరుగుతున్న ఈ సంఘటనలు తెలంగాణలోనూ ప్రభావితం చూపుతున్నట్లు కన్పిస్తున్నాయి. చంద్రబాబుకు జరిగిన అవమానంపై తెలంగాణకు చెందిన ఓ కుల నేత స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ వసుమారాధన కార్యక్రమంలో భాగంగా ఓ నేత వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు లాంటి వారిపై భౌతికదాడులు చేయాల్సిన అవశ్యకతను వివరించారు.

    Also Read: ఏపీలో వారందరికీ పెన్షన్ కట్.. జగన్ సార్.. ఏంటది?

    తమ కులాన్ని అణగదొక్కాలనుకునే వారిపై భౌతిక దాడులు తప్పవనే హెచ్చరికలను ఆ వేదిక నుంచి పంపించారు. భవిష్యత్ లో ఆ నేతలను తగిన గుణపాఠం చెబుతామంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే వారికి ఆర్ధిక చేయూతనిచ్చేందుకు తనవంతుగా రూ.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై రెండు రాష్ట్రాల్లోనూ విభిన్నమైన చర్చలు నడుస్తున్నాయి.

    ఏదిఏమైనా వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక మాత్రం కొన్ని కులాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందడానికి ఆ నేత చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. మరీ ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా కులాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందా లేదంటే ఇదే ధోరణిని అవలంభిస్తుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Also Read: జగన్ కు హైకోర్టులో ఊరట.. ఇక జెట్ స్పీడే..!