Kiran Abbavaram: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరాల కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలు వింటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తుంది.
కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశాడని సమాచారం. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. రామాంజులు రెడ్డి మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అభిమానులు వారి సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ కిరణ్ అబ్బవరం కు ధైర్యం చెబుతున్నారు.
Also Read: సినీ విషాదాల మయం : 2020 – 21లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్ళే !
రాజావారు రాణి గారు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన కిరణ్ అబ్బవరం… ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన సమ్మతమే, సెబాస్టియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా ప్రారంభం అయ్యింది.