https://oktelugu.com/

Sirivennela: సిరివెన్నెల పాటలు చాలా మందికి కనువిప్పు- తలసాని

Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చలనచిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఫిల్మ్​ ఛాంబ్​ర్​లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచగా.. తలసాయి సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ.. భావోద్వేగమయ్యారు. సుమారు 800కుపైగా సినిమాల్లో 3 వేలకుపైగా పాటలు రాసిన మానుభావుడు సినివెన్నెల అని అన్నారు. ఆయన రాసిన ప్రతి పాట అందిరికీ సులభంగా అర్థమయ్యేదని.. ఆయన పాటలన్నీ పండగల్లా ఉంటాయని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 12:42 pm
    talasani
    Follow us on

    Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చలనచిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఫిల్మ్​ ఛాంబ్​ర్​లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచగా.. తలసాయి సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ.. భావోద్వేగమయ్యారు.

    Sirivennela

    Sirivennela Seetharama Sastry

    సుమారు 800కుపైగా సినిమాల్లో 3 వేలకుపైగా పాటలు రాసిన మానుభావుడు సినివెన్నెల అని అన్నారు. ఆయన రాసిన ప్రతి పాట అందిరికీ సులభంగా అర్థమయ్యేదని.. ఆయన పాటలన్నీ పండగల్లా ఉంటాయని అన్నారు. సిరివెన్నెల రచనలు చాలా మందికి కనువిప్పు కలిగిస్తాయని.. అన్నారు. ఆయన మరణం అందరికీ తీరని లోటని.. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు తలసాని. ఇప్పుడున్న రచయితలు సిరివెన్నెల పాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

    Also Read: ఆయన లేని బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలట్లేదు- ఎన్టీఆర్​

    ఫిల్మ్​ఛాంబర్​లో సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహానికి పులువురు సినీ తారలు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కూడా​ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు.

    గతకొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. ఇటీవలే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మరణించారు. దీంతో సినీ లోకం శోకంసంద్రంలో మునిగిపోయింది. ఆయన లేని లోటు తీర్చేదెవరని పులువు సినీ ప్రముఖులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

    Also Read: సిరివెన్నెల గారు మనల్ని వదిలివెళ్ళడం ఎంతో బాధాకరం: రాజమౌళి