Farmers
Farmers : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక పథకాల్లో ‘రైతు భరోసా’ (Raithu Bharosa)ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించి, వారి వ్యవసాయ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాజాగా, రైతుల ఖాతాల్లో రూ. 200 కోట్లను జమ చేసే ప్రక్రియపై చర్చ జరుగుతోంది.
తాము అధికారంలోకి వస్తే రైతు బంధును రైతు భరోసాగా మారుస్తామని ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్(Congress) పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. రైతులు పండించిన పంటకు బోనస్(Bonus) ఇస్తామని తెలిపింది. అయితే సన్న ధాన్యానికి కొంత మందికి బోనస ఇచ్చింది. ఇక రైతు భరోసా మాత్రం వానాకాలం సీజన్‌లో ఎగ్గొట్టింది. తాజాగా యాసంగి నుంచి ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు మాత్రమే పెట్టుబడి అందించింది. ఇందులో భాగంగా తాజాగా మరో రూ.200 కోట్లతో 3 నుంచి 4 ఎకరాలలోపు వారికి భరోసా కల్పించింది. ఈ నిధులు చిన్న, సన్నకారు రైతులకు ప్రధానంగా లబ్ధి చేకూర్చనుండగా, వ్యవసాయంలో నిమగ్నమైన వారికే ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం ద్వారా రైతులు పంటల సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా పొందుతారు.3 నుంచి 4 ఎకరాల కేటగిరీలో ఇప్పట ఇరకు రూ.500 కోట్లు చెల్లించింది. దీంతో ఇప్పటి వరకు 54.74 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఇందు కోసం రూ.4,666.57 కోట్లు రైతులకు చెల్లించింది.
Also Read : ఏపీ మిర్చి రైతులకు గుడ్ న్యూస్… జగన్మోహన్ రెడ్డా? చంద్రబాబా?.. క్రెడిట్ ఎవరికి?
రైతుల్లో సంతోషం..
ప్రభుత్వం మార్చి వరకు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని తెలిసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 5 ఎకరాలలోపు రైతులకే సాయం అందించింది. ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 4,666.57 కోట్లు మాత్రమే జమ చేసింది. ఇంకా రూ.4 వేల కోట్లు చెల్లించాలి. మార్చి 31 వరకు చెల్లిస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు సగం మందికే జమ చేసింది.
Also Read : కిసాన్ దివస్ ప్రారంభం, ప్రత్యేకత.. ప్రాముఖ్యత