New Car : దేశంలో ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వాటిలో మొదట మారుతి సుజుకి ఇండియా 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత టాటా, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వాటి ధరలను 3 శాతం వరకు పెంచేందుకు రెడీ అయ్యాయి. దీంతో తక్కువ ధరకే కారు కొనాలనుకునే వారికి కేవలం మరో 5 రోజులే గడువు ఉంది. ఈ లోపల కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు తప్పనిసరిగా ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాలి.
ఇండియాలో చాలా మంది కారు కొనడానికి డీలర్ల దగ్గరకు వెళ్తుంటారు. కాబట్టి కారు కొనడానికి ముందు డీలర్‌ను ఈ 5 విషయాలను తప్పకుండా అడగండి. కొన్ని కంపెనీల షోరూమ్‌లు, డీలర్స్ టెస్ట్ డ్రైవ్ కోసం కార్లను ఇంటికే పంపిస్తున్నారు. ఇటీవల జెప్టో వంటి 10 నిమిషాల క్విక్ డెలివరీ సంస్థ కూడా స్కోడా కుషాక్ టెస్ట్ డ్రైవ్ కోసం ప్రజల ఇళ్లకు పంపించే సర్వీసును ప్రారంభించింది.
Also Read : మారుతి, టాటాలు మాత్రమే కాదు.. ధరలు పెంచే కార్ల కంపెనీల ఫుల్ లిస్ట్ ఇదే
కారు కొనడానికి ముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి
1. కారు కొనే ముందే ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఆన్-రోడ్ ధరను కూడా తెలుసుకోవాలి. ఆన్-రోడ్ ధరనే జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇది కారు కొనడానికి సరైన బడ్జెట్ వేసుకోవడానికి ఇది సాయపడుతుంది.
2. కారు వారంటీలో ఏమి కవర్ అవుతుందో వివరంగా తెలుసుకోండి. కారు మొదటి సర్వీస్ ఎప్పుడు, ఆ తర్వాత సర్వీస్‌లు ఎప్పుడెప్పుడు చేయించాలి, సర్వీస్ కు ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలను కూడా తెలుసుకోవాలి.
3. కొత్తగా కారు నడపడం నేర్చుకున్నా లేదా ఇది మీ మొదటి కొత్త కారు అయినా కారులోని వివిధ భాగాల సర్వీస్, వాటి ఖర్చు, ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ అవుతుంది వంటి వివరాలను తెలుసుకోవాలి.
4. చాలాసార్లు డీలర్స్ తమ దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి నమ్మిస్తుంటారు. ఇదేమీ తప్పనిసరి కాదు. మీకు నచ్చితే బయట లేదా ఆన్‌లైన్‌లో కూడా మీరు కొనుగోలు చేయాలనుకున్న కారు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అక్కడున్న ఇన్సూరెన్స్ ఆప్షన్లు, వాటిలో ఏమి కవర్ అవుతుంది వంటి వివరాలను తెలుసుకోవాలి.
5. కారు ఎప్పుడు డెలివరీ అవుతుందో డీలర్ నుంచి కన్ఫాం చేసుకోవాలి. కొన్నిసార్లు కారు డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది.
ఈ 5 విషయాలను తెలుసుకోవడం వల్ల కారు కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది.
Also Read : ఈ కార్ల మైలేజ్ 30 కిలోమీటర్ల పైనే.. ఏవో తెలిస్తే షాక్ అవుతారు..