spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila : రఘువీరా, షర్మిలతో ఏపీ కాంగ్రెస్ బలోపేతం కాగలదా?

YS Sharmila : రఘువీరా, షర్మిలతో ఏపీ కాంగ్రెస్ బలోపేతం కాగలదా?

YS Sharmila : దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ది ప్రత్యేక స్థానం. ఆ పార్టీకి సంక్షోభాలు సర్వసాధారణం. కిందకు పడిన ప్రతిసారి.. అదే స్పీడ్ లో పైకి లేవడం ఆ పార్టీ ప్రత్యేకత. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారు. అటు తర్వాత సోనియా గాంధీ కీ రోల్ ప్లే చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పతన స్థితిలో ఉన్న పార్టీని రాహుల్ పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు వచ్చింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగా ఏపీలో వైఎస్ షర్మిల, రఘువీరారెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. షర్మిల తన తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ వర్కింగ్ కమిటీలు పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి చోటు కల్పించారు. దీంతో కాంగ్రెస్ భారీ వ్యూహానికి తెర తీసినట్లయింది.

రఘువీరారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. వైయస్ కు అత్యంత సన్నిహితుడు. అంతకంటే మించి కాంగ్రెస్ కు వీర విధేయుడు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ సీనియర్లంతా వైసిపి బాట పట్టినా.. రఘువీరా మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అందుకే ఇప్పుడు ఆయన సీనియార్టీని, సిన్సియార్టీని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మరోవైపు రఘువీరారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ ప్రాంతం నుంచి కీలక నాయకుల కాంగ్రెస్ లో చేర్పించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు షర్మిల సైతం తోడు కానుండడంతో.. ఆమెకు మార్గదర్శకం చేస్తారని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. ఏఐసీసీ కార్యవర్గంలో రఘువీరా, పిసిసి అధ్యక్షురాలు హోదాలో షర్మిల వర్క్ అవుట్ అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం బలమైన నమ్మకంతో ఉంది. కాంగ్రెస్కు వివిధ కారణాలతో దూరమైన వర్గాలన్నీ దరిచేరతాయని భావిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version