spot_img
Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫెయిల్ అయిన కూడా గుడ్ అటెంప్ట్ అని అందరూ ప్రశంశలు కురిపిస్తారు. కానీ ప్రతిసారి కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ ని సాధించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే సంవత్సరంలో 100 సినిమాలు వస్తే అందులో 90 సినిమాలు కమర్షియల్ సినిమాలు గానే వస్తాయి. కేవలం 10 సినిమాలు మాత్రమే ఎక్స్పరిమెంటల్ సినిమాలు గా రూపొందుతాయి. ఈ 90 సినిమాల్లో చూపించింది కాకుండా చాలా కొత్తగా కమర్షియల్ సినిమాల్లో చూపించి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునే సినిమాలు చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటి ఒక టాస్క్ ను చాలా అలవోక గా దాటుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సంవత్సరం చిరంజీవిని సైతం 400 కోట్ల క్లబ్ లో చేర్చిన ఘనత తనకే దక్కింది. ఆయన ఎవరితో అయితే సినిమా చేస్తున్నాడో ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది.

సంవత్సరానికి ఒక సినిమా చొప్పున సినిమాలను చేసుకుంటూనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు సైతం ఎక్కువగా పనిని కల్పిస్తున్నాడు. అలాగే ప్రేక్షకులందరికి ఎడ్యుటైన్మెంట్ ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్స్ కి సైతం భారీ లాభాలను మిగులుస్తున్నాడు. మొత్తానికైతే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కావాలి అనేంతలా ప్రతి ఒక్కరు అతన్ని కోరుకుంటున్నారు.

అంటే అతని సక్సెస్ రేట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తనకి కష్టపడే తత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. మొత్తానికైతే ఇటు షో స్ లో కనిపిస్తున్నారు. పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. సినిమాలను కూడా చాలా వేగంగా చేస్తున్నాడు.

ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమా మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. ఇక తొందరలోనే రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసి దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలనే ప్రయత్నం లో ఉన్నాడు. మిగతా దర్శకులందరు అతన్ని చూసి సినిమాలు తొందరగా చేయడం ఎలానో నేర్చుకుంటే చాలా మంచిదని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
Oktelugu Epaper
Exit mobile version