CAG Report On AP: ప్రభుత్వ నిర్ణయాలు, ఉద్దేశాలు, ఖర్చులు తదితర వాటిని కాగ్ నివేదిక బయటపెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కాగ్ నివేదిక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో అందరిలో అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు కాగ్ రిపోర్టు ఇవ్వలేదా? లేక ప్రభుత్వమే బయటపెట్టలేదా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల భారంలో పడిపోవడంతో కాగ్ నివేదికపై అందరికి ఆసక్తి నెలకొన్నా దానికి సంబంధించిన నివేదక మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం.
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కానీ కాగ్ రిపోర్టు మాత్రం బయటకు రాకపోవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఎవరికి తెలియడం లేదు. విజయవాడలోని బెరం పార్కును సైతం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక సీక్రెట్ ఉంచడం సంశయాలకు తావిస్తోంది. నివేదిక బయటకు వస్తే ఏపీ ప్రభుత్వం భవిష్యత్ కనిపించేదనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: CM KCR- Governor Tamilisai: కేసీఆర్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేసిన గవర్నర్
మరోవైపు మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టుకుని సర్కారు నిర్వహణ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కావాలనే కాగ్ రిపోర్టు బయటపెట్టలేదా? లేక కాగే రిపోర్టు ఇవ్వలేదా? అనేది అందరిలో అనుమానాలకు బీజం వేస్తోంది. మొత్తానికి కాగ్ నివేదిక బయటపెడితేనే ప్రభుత్వ నిర్వాకం బయటపడుతుందని తెలియడంతోనే ప్రభుత్వం ఇలా చేసిందనే విషయం అందరికి తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల ఊసే ఉండటం లేదు. రోడ్ల దుస్థితిపై ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించినా సర్కారు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో కాగ్ నివేదిక ఎందుకు బయటకు రాలేదనే విమర్శలకు సర్కారు ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?