https://oktelugu.com/

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ పై ఆ ‘వెబ్ సైట్’ పగ.. ఎందుకంటే ?

RRR Movie: ‘రాజమౌళి’కి విజయం అనేది అత్యంత సహజమైన అంశం అయిపోయింది. శ్రద్ధగా గోడ కట్టినట్టు సినిమాలు తీసే నైజం రాజమౌళిది. స్క్రిప్ట్ దగ్గర నుంచే రాజమౌళి పర్ఫెక్షన్ మొదలవుతుంది. అలాగే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు. కానీ.. ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న తడబడ్డాడు అంటూ, రాజమౌళి తన రాజముద్రని చూపించలేక మొదటిసారి ఓటమి రుచి చూశాడు అంటూ నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ఒకపక్క ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతం అంటూ ప్రజలందరూ పొగుడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 03:38 PM IST
    Follow us on

    RRR Movie: ‘రాజమౌళి’కి విజయం అనేది అత్యంత సహజమైన అంశం అయిపోయింది. శ్రద్ధగా గోడ కట్టినట్టు సినిమాలు తీసే నైజం రాజమౌళిది. స్క్రిప్ట్ దగ్గర నుంచే రాజమౌళి పర్ఫెక్షన్ మొదలవుతుంది. అలాగే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు. కానీ.. ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న తడబడ్డాడు అంటూ, రాజమౌళి తన రాజముద్రని చూపించలేక మొదటిసారి ఓటమి రుచి చూశాడు అంటూ నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.

    RRR Movie

    ఒకపక్క ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతం అంటూ ప్రజలందరూ పొగుడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క భారీ రేటింగ్ లు ఇవ్వడానికి మిగిలిన పేరు ఉన్న మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. కానీ, ఒక పెద్ద వెబ్ సైట్ (నెగిటివిటీకి ఆ సైట్ పర్యాయపదం లాంటిది) మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి 2.5 రేటింగ్ ఇచ్చింది. మొదటి రోజు 118 కోట్లు కలెక్ట్ చేసిన ఒక సినిమాకి 2.5 రేటింగ్ అంటే ఎంత దారుణం ? ఇదేదో సాదాసీదా సినిమా కాదు. తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిన సినిమా.

    Also Read: SS Rajamouli Movies: రాజమౌళి తీసిన 12 సినిమాలు ఏవి ? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ?

    ఇలాంటి సినిమాకి నేషనల్ మీడియా కూడా బ్రహ్మరధం పట్టింది. కానీ, ఆ సదరు తెలుగు వెబ్ సైట్ మాత్రం దారుణమైన రేటింగ్ ఇచ్చింది. కావాలనే ఇచ్చింది అని అర్ధం అవుతుంది. కానీ అసలు కారణం ఏమై ఉంటుంది ? అంటూ ఈ సినిమా మేకర్స్ కూడా ఆరా తీస్తున్నారు.

    అయితే.. ఆ సదరు వెబ్ సైట్ ‘ఆర్ఆర్ఆర్’ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి ప్రధాన కారణం.. తమ వెబ్ సైట్ కి ల్యాండింగ్ పేజీ ఇవ్వలేదు అని అక్కసు పెంచుకోవడమేనట. ఈ సదరు వెబ్ సైట్ 12 గంటల పాటు ల్యాండింగ్ పేజీ (సినిమా భారీ పోస్టర్)ని తమ వెబ్ సైట్ లో పెట్టుకున్నందుకు గానూ 90 వేలు నుంచి లక్ష 30 వేలు వరకూ ఛార్జ్ చేస్తోంది. కనీసం మూడు రోజులు పాటు తమ సైట్ లో ల్యాండింగ్ పేజీ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటూ నిర్మాతలను ఆ వెబ్ సైట్ డిమాండ్ చేస్తుంటుంది.

    అసలు ల్యాండింగ్ పేజీ పబ్లిసిటీలో భాగం. మరీ ‘ఆర్ఆర్ఆర్’కు పబ్లిసిటీ అవసరం లేదు కదా. అందుకే.. ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆ సైట్ కి ల్యాండింగ్ పేజీ ఇవ్వలేదు. ఆ కోపం కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో సదరు వెబ్ సైట్ చాలా దిగజారి నెగిటివ్ ప్రచారానికి దిగింది.

    RRR

    పైగా హీరోలు దగ్గర్నుంచి, నిర్మాత దాకా….డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రేక్షకుల దాకా అందరూ రాజమౌళిని గుడ్డిగా నమ్మి తప్పు చేశారని మొసలి కన్నీరు కార్చింది. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రాజమౌళి పోగొట్టుకున్నాడు అని విమర్శలు చేసింది.

    ఈ సినిమా విషయంలో రాజమౌళి అత్యంత దారుణంగా నిరాశపరిచాడని.. అసలీ సినిమాని రాజమౌళియే తీసాడా ? అంటూ జనంలో కూడా డౌట్ పెంచే ప్రయత్నం చేసింది. జర్నలిజం నిజాన్ని బతికించాలి. లాభం లేదు కదా అని.. అబద్దాన్ని నిజం చేయాలనుకోకూడదు. పైగా బాహుబలి-2 కి వచ్చిన హైప్ ను క్యాష్ చేసుకోవడానికే.. రాజమౌళి ఈ సినిమా తీశాడని ఆరోపణలు చేయడం ఏ మాత్రం అంగీకరించదగ్గ విషయం కాదు. ఇప్పటికైనా విషయం లేని విష ప్రచారాన్ని ఆ సదరు వెబ్ సైట్ మానుకోవాలని ఆశిద్దాం.

    Also Read: RRR Tickets Are Blocked In Ap: మైండ్ ‘బ్లాక్’…ఆర్ఆర్ఆర్ సినిమాను సొమ్ము చేసుకున్న వైసీపీ నేతలు

    Tags