https://oktelugu.com/

CM KCR: వడ్ల కొనుగోలుపై కేసీఆరే ఇంత పని చేశారా.. అప్పుడెందుకు నిరసన చేయలేదు సార్..

CM KCR: ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని ఓ సమస్య తెలంగాణలోనే ఉంది. అదే వడ్ల కొనుగోలు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నానా రాద్ధాంతం చేస్తోంది. కానీ కేంద్రం ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వమే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందం చేసుకుందని చెబుతోంది. కానీ కేసీఆర్ ప్రభుత్వమేమో కేంద్రమె మెడ మీద కత్తి పెట్టి రాయించుకుందని.. ఇప్పుడు తమ వడ్లు కొనాలి అంటూ డిమాండ్ చేస్తోంది. మరి ఏ రాష్ట్రంలో లేని […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 26, 2022 / 02:59 PM IST
    Follow us on

    CM KCR: ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని ఓ సమస్య తెలంగాణలోనే ఉంది. అదే వడ్ల కొనుగోలు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నానా రాద్ధాంతం చేస్తోంది. కానీ కేంద్రం ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వమే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందం చేసుకుందని చెబుతోంది. కానీ కేసీఆర్ ప్రభుత్వమేమో కేంద్రమె మెడ మీద కత్తి పెట్టి రాయించుకుందని.. ఇప్పుడు తమ వడ్లు కొనాలి అంటూ డిమాండ్ చేస్తోంది.

    CM KCR

    మరి ఏ రాష్ట్రంలో లేని ఈ తలనొప్పి కేవలం తెలంగాణలోనే ఎందుకు ఉంది.. పక్కనే ఉన్న ఏపీలో కూడా ఎండాకాలంలో పంట సాగు చేస్తారు. మరి అక్కడ ఈ సమస్య లేదు ఎందుకు. అంటే ఈ ప్రశ్నకు ఓ సమాధానం కూడా ఉంది. కెసిఆర్ ప్రభుత్వమే వరిధాన్యం మీద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్ సీఐ తరఫున హైదరాబాద్ రీజినల్ మేనేజర్ మధ్య కీలక ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

    Also Read:   కేసీఆర్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేసిన గవర్నర్

    ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట ఎఫ్ సిఐకి పారా బాయిల్డ్ రైస్ అమ్మ బోమని, రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే విధంగా తెలంగాణలో పరిశ్రమలు పెంచుకుంటామని చెప్పిందట. అలాగే బియ్యానికి కొన్ని పోషకాలను యాడ్ చేసి ఫోర్టిఫైడ్ గా మారుస్తామని ఈ ఒప్పందంలో రాసి ఇచ్చినట్లు సమాచారం. దీన్నే ఇప్పుడు కేంద్రం ఎత్తి చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కేంద్రం అంటోంది.

    అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒప్పందానికి మించి కొనుగోలు చేయాలని పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల నడుమ వడ్ల రాజకీయం జరుగుతోంది. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు.. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేయాలని ఒత్తిడి చేస్తే.. అప్పుడే నిరసన తెలపవచ్చు కదా. ఎవరికీ చెప్పకుండా ఒప్పందం చేసుకుని.. ఇప్పుడు కేంద్రం పై నిందలు వేస్తూ రాజకీయం చేయడం రైతులను నట్టేట ముంచడమే అవుతోంది.

    CM KCR

    ఇప్పుడు కేంద్రంపై ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్.. అప్పుడు ఒప్పందం విషయంలో సంతకం ఎందుకు పెట్టాలి అని ఎందుకు అడగలేదు. ఇప్పుడు పంజాబ్ ను చూపిస్తున్న కేసీఆర్.. అప్పుడు ఎందుకు చూపించలేదు అనే అనేక ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఏదో మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒప్పందంలో చెప్పినట్టు రైస్ బ్రాన్ ఆయిల్ ఏమైనా తయారు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇలా కేసీఆరే అనవసర రాద్ధాంతంని తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

    Also Read: విశాఖ రైల్వే జోన్ మీద కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు కూడా ఓకే..

    Tags