https://oktelugu.com/

Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 కాదు 21.. కేంద్రం నిర్ణయంతో అందరిలో హర్షం

Marriage Age: మనదేశంలో గతంలో బాల్య వివాహాలు జరిగేవి. దీంతో వారికి అనేక సమస్యలు వచ్చేవి. కానీ కాలక్రమంలో భాగంగా వారిలో కూడా మార్పు వచ్చింది. ప్రస్తుతం వారి వివాహ వయసు గతంలో 18 ఏళ్లుగా ఉండగా ఇప్పుడు అది 21 కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లుగా వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా వయసు 21కి పెంచుతున్నట్లు ప్రకటించడం ఆహ్వానించదగినదే. మహిళల […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 16, 2021 / 02:31 PM IST
    Follow us on

    Marriage Age: మనదేశంలో గతంలో బాల్య వివాహాలు జరిగేవి. దీంతో వారికి అనేక సమస్యలు వచ్చేవి. కానీ కాలక్రమంలో భాగంగా వారిలో కూడా మార్పు వచ్చింది. ప్రస్తుతం వారి వివాహ వయసు గతంలో 18 ఏళ్లుగా ఉండగా ఇప్పుడు అది 21 కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లుగా వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా వయసు 21కి పెంచుతున్నట్లు ప్రకటించడం ఆహ్వానించదగినదే.

    Marriage Age

    మహిళల సమస్యల దృష్ట్యా కూడా వివాహ వయసు పెంచడానికి దోహదపడిందని తెలుస్తోంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. నెలసరి ఇబ్బందులైతే మరింత బాధ పెడతాయి. దీంతో వారు నెలనెల పడుతున్న కష్టాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం శిరోధార్యమే. కేవలం 18 ఏళ్లకే వివాహమైతే వారిలో సమస్యల్ని ఎదిరించే శక్తి తక్కువే అని చెప్పాలి. దీంతో వారు అత్తవారింట్లో అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం పెంచిన వయసుతో వారికి దాదాపు కష్టాలకు ఎదురీదే సత్తా వస్తుంది. దీంతో అక్కడ వారు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

    దేశంలో జనాభా పెరుగుదల కూడా ప్రధాన సమస్యగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సమస్య కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం జనాభా పెరుగుదల అదుపులోనే ఉంది. కానీ మహిళల సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కనీస వివాహ వయసు 21కి పెంచడం సమంజసమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

    పైగా మహిళా సాధికారత కోసం కూడా ఈ నిర్ణయం దోహదపడగలదని తెలుస్తోంది. మహిళల్లో సమస్యలను ఎదుర్కొని సమర్థవంతంగా పోరాడేందుకు ఈ వయసు సరిపోతుంది. అందుకే కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అనే అభిప్రాయం అందరిలో నెలకొనడం విశేషం. భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ వయసు ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నారు.

    Also Read: Narendra Modi: అగ్రారాజ్యాల అధినేత‌ల‌ను దాటేసిన మోడీ.. ప్ర‌పంచంలో ఆయ‌న ర్యాంకు ఎంతంటే…?

    మహిళల కనీస వివాహ వయసు పెంపుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో త్వరలోనే హిందూ వివాహ చట్టం-1955, ప్రత్యేక వివాహ చట్టం-1954, బాల్య వివాహాల నిషేధ చట్టం-2006కు సవరణలు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆ చట్టాల్లో వారి వయసు 18గా ఉంది.

    Also Read: PM Modi: తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన ప్రధాని మోడీ.. 2024 ఎన్నికలే టార్గెట్

    Tags