https://oktelugu.com/

RRR Movie: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 02:40 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

    RRR Movie

    Also Read: రికార్డుల వేట మొదలుపెట్టిన ‘ఆర్​ఆర్​ఆర్​’.. 100 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న ట్రైలర్​

    కాగా ఇప్పుడు తాజాగా తన ఫిల్మ్ కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ హిందీ డైలాగ్స్‌ చెబుతున్నారు ఎన్టీఆర్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసమే హిందీ మాట్లాడుతున్నారు తారక్. దాదాపు 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్‌నే వినిపించనున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ హిందీలో డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో సోషల్ మీడియా లో వైరల్‌ అవుతోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన ట్రైలర్ య్యూట్యూబ్‌ కుంభస్థలాన్నే కొట్టేస్తోంది. 100 మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా ట్రైలర్. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా వెయిట్ చేస్తున్నారు.

    Also Read: ఆ అవమానం బన్నీలో మార్పుకి కారణమైంది !