Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ , రష్మిక మందన్నా ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్ లో కొన్ని రూమర్స్ కారణంగా మేకర్స్ తో పాటు అభిమానులు ఆందోళనకు గురైనా… సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సర్వం సిద్ధం అంటూ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘పుష్ప’ టీంను విష్ చేస్తూ ట్వీట్ చేయడం విశేషం.
mega star chiranjeevi wishes allu arjun pushpa movie team
Also Read: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !
మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, గుండె, ఆత్మను ఉంచారు “గుడ్ లక్ ‘పుష్ప’ టీం అని చిరు ట్వీట్ చేశారు. మీ ప్రయత్నాలన్నీ హృదయ పూర్వకంగా అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను. డియర్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘పుష్ప’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా ప్రమోషన్లలో మెగా ఫ్యామిలి ఎక్కడా పాల్గొనక పోవడం పట్ల ‘పుష్ప’రాజ్ కు మెగా సపోర్ట్ లేదా అనే డౌట్ కూడా అందరికీ వచ్చింది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా హీరోలు కన్పిస్తారేమో అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి స్వయంగా చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ ట్వీట్ చేయడం బన్నీ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
Wishing dear @alluarjun Director #Sukumar @iamRashmika @MythriOfficial & entire Team of @PushpaMovie All the Very Best!
You all have put your Blood,Sweat,Heart & Soul into this film! I wish all your efforts will be whole heartedly appreciated! Good Luck 👍— Chiranjeevi Konidela (@KChiruTweets) December 16, 2021
Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !