Bypolls Results: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒక లోక్ సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అన్నింట్లో పరాభవమే ఎదురైంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీహార్ లో ఆర్జేడీ అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. దీంతో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు.దీంతో బీజేపీ అంతర్మథనంలో పడింది. ఓటమికి కారణాలు అన్వేషిస్తోంది. ఓటర్లు ఎందుకు విశ్వాసం ప్రకటించలేదని ఆరా తీస్తున్నారు.
అయితే ఈ ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని దీంతోనే తమకు విజయం దక్కలేదని చెబుతోంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలైతే బీజేపీకే పట్టం కడతారని తెలిసిందే. ఇవి వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కావడంతో అక్కడి వారికే ప్రాధాన్యం ఇస్తారని వివరణ ఇస్తున్నారు. దీంతోనే తమకు విజయం దక్కలేదని సూచిస్తున్నారు.
Also Read: Secretariat Employees: మూడు పుటలా హాజరు వేయాల్సిందే.. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్
టీఎంసీ అభ్యర్థులు మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలో దేశ రాజకీయాలు ప్రభావితం కానున్నాయనే సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఏదో ఒకటి రెండు చోట్ల గెలిస్తే నేతలు కాలేరని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు మాత్రం తప్పలేదని తెలుస్తోంది.
ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ జోష్ లో ఉంది. తమకు చత్తీస్ గడ్ లో విజయం సాదించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందని అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క విజయం కూడా దక్కలేదని భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దేశంలో ప్రభావవంతమైన విధానాలతో విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నానాటికి బీజేపీ విధానాలు ప్రజలకు నచ్చడం లేదని తెలుస్తోందని సూచిస్తున్నారు.
Also Read:Padayatra: పాదయాత్రలే.. పార్టీకి ప్రాణపోస్తాయా..‘రోడ్డు’న పడుతున్న నేతలు