Prabhas: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న ప్రముఖ నటుడు ప్రభాస్ కారుకు జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. దీన్ని వారు ఖండిస్తున్నారు. అది ప్రభాస్ కారు కాదని చెబుతున్నారు. కాకపోతే మరి ఎవరిది అనే దానిపై స్పష్టత లేదు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో ఓ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపి పరిశీలించి దానికి మూడు చలాన్లు వేశారు. దీంతో ఈ వార్త నిన్న అన్ని వార్తా పత్రిల్లో ప్రముఖంగా వచ్చింది. దీంతో అది ప్రభాస్ కారు కాదని మరో వార్త వచ్చింది. ఇందులో నిజమెంత? అబద్దమెంత?
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల కాలంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడం లేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్, మరో నటుడు మంచు మనోజ్ కార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని చలాన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కూడా ప్రభాస్ కారుకు జరిమానా విధించారని వార్తలు రావడం గమనార్హం.
Also Read: Pawan Kalyan Son First Film: పవన్ కళ్యాణ్ కొడుకు మొదటి సినిమా ఆ దర్శకుడితో..??
నంబర్ ప్లేటు సరిగా లేదని, ఎంపీ స్టిక్కర్ వాడారని, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టారని మూడు కేసులు కేసుల్లో మూడు చలాన్లు విధించినట్లు వార్తలొచ్చాయి. దీంతో రూ. 1600లకు చలానా రాశారని తెలిసింది. దీన్ని ప్రభాస్ పీఆర్ టీం ఖండిస్తోంది. అది ప్రభాస్ కారు కాదని బుకాయిస్తోంది రోడ్ నెం. 36లో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న కారుకు ప్రభాస్ కు సంబంధమే లేదని చెబుతున్నారు.
ఇంత జరిగినా మాది కాదని చెబుతున్నారు. కానీ అది మరి ఎవరిదో అనే దాని గురించి మాత్రం ప్రస్తావన లేదు. ఇంతకీ ఆ కారు ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? దాని యజమాని ఎవరు? అనే విషయాలు మాత్రం వెల్లడించడం లేదు. అంటే ఇందులో ఏదో మతలబు ఉందని తెలుస్తోంది దీనిపై పూర్తి విచారణ చేపడితే నిజాలు అవే బయటకు వస్తాయి. ఎందుకింత దాపరికం? ఎందుకు తప్పించుకోవాలని చూడటం అనే వాదనలు సైతం వస్తున్నాయి. మొత్తానికి ఆ కారు ఎవరిదో తేలాల్సి ఉంది.
Also Read:KGF 2 3 Days Collections: KGF chapter2 3 రోజుల వసూళ్లు