SS Rajamouli RRR Movie: రాజమౌళి అంటేనే ఒక గొప్ప పర్ ఫెక్షనిస్ట్..‘నాటు నాటు’ సాంగ్ ను పర్ ఫెక్ట్ గా రావడానికి ఉక్రెయిన్ తీసుకెళ్లి మరీ 20 రోజులు షూట్ చేశాడని ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి అంత పర్ ఫెక్షనిస్ట్ తాజాగా బ్లండర్ మిస్టేక్ చేశాడు. అదిప్పుడు ఎవరూ గుర్తించలేదు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ‘కొమ్మ ఉయ్యాలో’ పాటలో ఈ తప్పు ఉంది. ప్రతీ సీన్ ను అద్భుతంగా చెక్కే రాజమౌళి ఇక్కడ ఎందుకు తప్పు చేశాడన్నది ఎవరీకీ అంతుబట్టడం లేదు. లాజిక్ మిస్ అయ్యి కొన్ని సీన్లు ఉన్నాయని ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’పై ఒక నింద ఉంది. ఇప్పుడు దానికి మరింత విమర్శలు వచ్చేలా ‘కొమ్మ ఉయ్యాలో’ పాటలో తప్పు ఉంది. దీంతో నెటిజన్లు రాజమౌలిని ఆడుకుంటున్నారు. ఈ తప్పేంటి జక్కన్న అంటూ నిలదీస్తున్నారు.
ఆర్ఆర్ఆర్.. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్ లు కలిసి నటించారు. తారక్ కొమురంభీంగా జీవించగా.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లతో పరుగులుపెడుతోంది. ఇప్పటికే కలెక్షన్లు 1000 కోట్లు దాటేసింది.
Also Read: Bypolls Results: ఉప ఎన్నికల్లో బీజేపీ గల్లంతు.. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే
ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పూర్తిస్థాయి‘నాటు నాటు’ ఆకట్టుకుంది. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. ఈ ఊపులోనే తాజాగా ‘కొమ్మ ఉయ్యాలో’ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్నారి ‘ప్రకృతిరెడ్డి’ ఆలపించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు.
సినిమాలో బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ చేస్తూ మల్లి అనే చిన్నారి ఈ పాటను ఆలపిస్తుంది. ఈ పాటతోనే సినిమా మొదలవుతుంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాటలో ఓ బ్లండర్ మిస్టేక్ ను మాత్రం రాజమౌళి చేయడం గమనార్హం.
పాట చివరలో ఢిల్లీ నుంచి మల్లిని ఆదిలాబాద్ గూడానికి కొమురం భీం అయిన ఎన్టీఆర్ భుజాల ఎత్తుకొని తీసుకొస్తాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆమె తల్లి పరిగెత్తుకొని వచ్చి బిడ్డను హత్తుకొని ఏడుస్తుంది. అనంతరం ఎన్టీఆర్ కాళ్లపై పడి కృతజ్ఞతలు తెలుపుతుంది.
ఇక లాజిక్ ఎక్కడ మిస్ అయ్యిందంటే.. మల్లిని బ్రిటీష్ దొరసాని తీసుకెళుతుండగా అడ్డుపడుతున్న ఆమె తల్లిని బ్రిటీష్ వారు కర్రతో కొట్టి చంపేస్తారు. ఆ సీన్ ను రాజమౌళి సినిమా మొదట్లోనే చూపిస్తాడు. విగత జీవిగా తల్లి చనిపోతే షాక్ తో వెళ్లిపోతున్న మల్లిని రాజమౌళి చూపించాడు. బ్రిటీష్ సైనికుడు కొట్టడం.. ఆమె రక్తం ఏరులై పారి చనిపోయినట్టుగా తల్లిని చూపించాడు. మరి చనిపోయిన తల్లి చివరకు ఎలా లేచివచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజమౌళి లాజిక్ మిస్ అయ్యాడని అంటున్నారు.
ఇక్కడే కాదు.. ఎన్టీఆర్ ను కొరఢాతో కొట్టి అంత హింసించాక కూడా నెక్ట్స్ సీన్ లో అతడు కోలుకొని ఫైట్ చేయడాన్ని జనాలు హర్షించరు. నిజంగా అంత ట్రీట్ మెంట్ జరిగాక.. మనిషి అన్నవాడు కనీసం ఆరేడు నెలలు కనీసం మంచపైనుంచే లేవడు. కానీ మన హీరోలు అలా లేచి ఫైట్ చేస్తారంతే.. ఇక రాంచరణ్ మోకాళ్లు పగులగొట్టిన బ్రిటీష్ వారు అతడిని లేవకుండా చేస్తారు. కానీ ఎన్టీఆర్ చెట్ల మందు పోయగానే రాంచరణ్ లేచి బాణాలు చేతబట్టి బ్రిటీష్ వారిని చంపేస్తుంటాడు.
అంతటి గాయాలు కలిగినా హీరోలు ఫైట్ చేయడమే ఒక వింత.. ఇక మల్లి తల్లిచనిపోయినా చివరకు చూపించాడు. ఇలా లాజిక్ లేని ప్రశ్నలెన్నో ఆర్ఆర్ఆర్ లో ఉన్నాయి. రాజమౌళి తెలియక చేశాడో తెలిసి చేశాడో కానీ ఇవి మాత్రం అందరూ గుర్తిస్తున్న తప్పిదాలు..