By Election Results: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు శుక్రవారం ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు_24 కు ముందు బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కూటమి, 23 ప్రధాన ప్రతిపక్షాల ఇండియా కూటమి హోరాహోరీగా మాటలు యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ట్రెండ్ ఇలా సాగుతోంది
దుమ్రి, (జార్ఖండ్).. ఇక్కడ ఏజే ఎస్ యూ పార్టీ లీడ్ లో ఇంది. పూతప్పల్లి(కేరళ).. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఘోసి(ఉత్తర ప్రదేశ్) ఈ స్థానంలో సమాజ్వాది పార్టీ లీడ్ లో ఉంది. బాక్సా నగర్( త్రిపుర).. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.. ధన్ పూర్(త్రిపుర).. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు..బాగేశ్వర్( ఉత్తరాఖండ్) బిజెపి అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. ధూప్ గురి( పశ్చిమ బెంగాల్) తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
త్రిపురలో కమలవికాసం
ఈశాన్యంలోని అతి చిన్న రాష్ట్రమైన త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలనూ బిజెపి గెలుచుకుంది. ధన్ పూర్, బాక్సా నగర్ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. బాక్సా నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందిన టాపా జ్జాల్ హోసైన్ ఏకంగా 30,237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.పోల్ అయిన ఓట్లలో 66% హోసైన్ కే పడటం విశేషం. ఆయన సమీప అభ్యర్థి మిజాన్ హోసైన్ కు( సీపీఐ(ఎం)) కు 3,909 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఇక ధన్ పూర్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి దేబ్ నాథ్ విజయం సాధించారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉంటే ఈ నియోజకవర్గంలో బిందు 18,871 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్ జల్ పాయ్ గురి జిల్లా ధూప్ గురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్రరాయ్ 4,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2021 లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ భార్య తపసి రాయ్ ఇక్కడి నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. చంద్ర రాయ్ చేతితో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన సిపిఎం అభ్యర్థి ఐశ్వర్ చంద్రరాయ్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు.