Rules Ranjan: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు విడుదల చేస్తున్నా హిట్ మాత్రం దక్కడం లేదు. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి చిత్రాలు కిరణ్ అబ్బవరం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల మాస్ హీరోగా ఎదిగేందుకు కమర్షియల్ సబ్జెక్ట్స్ కూడా చేశాడు. అవేవీ ఫలితం ఇవ్వలేదు. ఈసారి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు. ఆయన తాజా చిత్రం రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాలకు పైగా ఉన్న రూల్స్ రంజన్ ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ గా సాగింది. కామెడీ, రొమాన్స్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే రూల్స్ రంజన్ అనగానే స్ట్రిక్ట్, డిసిప్లైన్ వంటి షేడ్స్ ఊహించాము. ట్రైలర్ లో ఆ దాఖలాలు లేవు.
మందు కొట్టడం, రొమాన్స్ చేయడం చేశాడు రంజన్. అమ్మ పాలిచ్చి పెంచుతుంది. నాన్న మందిస్తాడు అని తండ్రి పాత్ర చేత చెప్పించారు. ఇక లెక్కకు మించిన కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్, అజయ్, సుబ్బరాజ్ తో పాటు పలువురు నటించారు. ఇక నేహా శెట్టి, మెహెర్ చాహల్ గ్లామర్ హైలెట్ అని చెప్పాలి.
సలార్ మూవీ విడుదల వెనక్కి వెళ్లగా రూల్స్ రంజన్ సినిమాను ఆ తేదీకి ప్రకటించారు. సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ కలిసొచ్చిన నేపథ్యంలో అది గోల్డెన్ డేట్. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే వరుసగా ఐదు రోజులు వసూళ్లు బాదుకోవచ్చు. ఇదే తేదీన స్కంద విడులవుతున్నట్లు సమాచారం. రూల్స్ రంజన్ చిత్రాన్ని రతినం కృష్ణ తెరకెక్కించాడు. అమ్రిష్ మ్యూజిక్ అందించారు.