ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు..

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. గత కొన్ని రోజుల కిందట పీఆర్సీపై ప్రతిపాదన లీకవడంతో ఉద్యోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఉద్యోగ సంఘాలతో చర్చలు కేసీఆర్ చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం ప్రతిపాదననేని, కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వారు చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ పీఆర్సీపై సమావేశం […]

Written By: NARESH, Updated On : March 10, 2021 6:06 pm
Follow us on

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. గత కొన్ని రోజుల కిందట పీఆర్సీపై ప్రతిపాదన లీకవడంతో ఉద్యోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఉద్యోగ సంఘాలతో చర్చలు కేసీఆర్ చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం కేవలం ప్రతిపాదననేని, కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వారు చెప్పారు.

తాజాగా సీఎం కేసీఆర్ పీఆర్సీపై సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మరోసారి వారు ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్న విషయం తెలిసిందే. వారి కంటే 2 లేదా 3 శాతం ఎక్కువగానే ఫిట్మెంట్ ఇవ్వడానికి సీఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇక ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి పీఆర్సీ వర్తించదని రకరకాలుగా కథనాలు వచ్చాయి. అయితే టీచర్లకు కూడా పీఆర్సీ వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అలాగే పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు సర్వీసులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఫ్యామిలీ ఫెన్షన్ ఇవ్వడానికి సీఎం ఒప్పుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.