కరోనా లాక్‌డౌన్ ఏమోకానీ ఏ హీరోకు.. ఏ రాజకీయ నేతకు దక్కని ఫేమ్ దక్కింది బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఆయన రీల్ లైఫ్ హీరో కాదు.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌లో ప్రజలు పడిన ఇబ్బందులు తీర్చిన గొప్ప నటుడు సోనూసూద్. ఇప్పుడు సోనూసూద్‌కు ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అంటూ తేడా లేదు.. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయనకు అందే గౌరవం వేరు.
Also Read: బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి..: అందుకే ఈ దాడులా..?
ఎంతో మందికి దేవుడిలా సాయం అందించి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు రవాణా ఏర్పాట్లతో మొదలైన సోనుసూద్ దాతృత్వం అనంతరం.. సోషల్ మీడియా వేదికగా ఎవరేం సాయం కోరినా ఇచ్చే స్థాయికి చేరింది. ఇక సోనూసూద్ చేస్తున్న ఈ సేవలకు ప్రజలు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సినిమాలు చూడని వారు కూడా సోనూకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Also Read: జానాకు దీటైన అభ్యర్థుల కోసం వేట .: సాగర్‌పై పార్టీల ఫోకస్
తెలంగాణలోని సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్న ఓ తండా ప్రజలైతే ఏకంగా సోనూసూద్‌కు గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. ఇలా సోనూసూద్ కలియుగ కర్ణుడిగా మారడంతో తెలంగాణకు చెందిన మరో ఫ్యాన్.. సోనూపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన పండగ నవీన్, త్రివేణి దంపతులకు ఇటీవల ఓ కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఆ పత్రికలో చిన్నారి పేరును ‘సోనూసూద్’గా ముద్రించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో తల్లిదండ్రులు ఆ చిన్నారికి సోనూసూద్ అని పేరు పెట్టుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. నిజంగా సోనూసుద్ చాలా గొప్పవ్యక్తని, అతని జన్మ సార్థకమంటూ నెట్టింట్లో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వాహ్.. ఒక నటుడిగా.. ఓ మంచి వ్యక్తిగా ఇంతకన్న గుర్తింపు ఇంకేం కావాలి. హ్యాట్సాప్ సోనూసూద్. మీ సేవలను ఇలానే కంటిన్యూ చేయండి.