https://oktelugu.com/

BSF forces : మమతా బెనర్జీని లెక్కచేయని బీఎస్ఎఫ్ బలగాలు.. బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

మన దేశం ఏమైనా శరణార్థులకు విడిది కేంద్రమా" అంటూ నెటిజన్లు మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ మాటను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు పక్కన పెట్టిందని.. దేశం కోసం తన పని తాను చేస్తోందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2024 / 02:12 PM IST

    BSF forces that did not count Mamata Banerjee

    Follow us on

    BSF forces : ” పశ్చిమ బెంగాల్ మీకు ఆహ్వానం పలుకుతోంది. మీరు మీ దేశం నుంచి ఈ ప్రాంతానికి రావచ్చు. ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు ఆందుతాయి. మీ యోగక్షేమాలకు నాదీ గ్యారంటీ. బెంగాల్ అనేది సంక్షుభిత రాష్ట్రం కాదు. సంక్షేమానికి పర్యాయపదం. ఎంతమంది వచ్చినా మేము అక్కున చేర్చుకుంటాం. మా ఆప్యాయతను వారికి చూపిస్తాం” ఇవీ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. “ఆమె ఎన్నికలలో గెలిచేందుకు ఎలాంటి రాజకీయాలకైనా పాల్పడతారు. రోహింగ్యాలకు ఆశ్రయమిస్తారు. బంగ్లా పౌరులకు శరణార్థుల పేరుతో పౌరసత్వం కల్పిస్తారు. దొడ్డి దారిన ఓట్లు సాధించి ఎన్నికల్లో గెలుస్తారని” బిజెపి నాయకులు ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల లొల్లి మొదలైంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఆ తర్వాత అక్కడ శాంతిభద్రతలు కట్టు తప్పాయి. అశాంతి చెలరేగింది. హింస తారా స్థాయికి చేరింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.

    ప్రాణాలు అరచేత పట్టుకొని..

    బంగ్లాదేశ్లో హింసాకాండ తారా స్థాయికి చేరడంతో బంగ్లాదేశ్ లోని ప్రజలు చాలామంది ప్రాణాలు అరచేత పట్టుకొని భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా వేలాదిమంది సరిహద్దుల్లో కి వచ్చారు. వారందరిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంటున్నది. అయితే వీరందరిలో హిందువులు ఎక్కువగా ఉండడం విశేషం. షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయి. బౌద్ధులపై హింసకాండ పెచ్చరిల్లింది. ఇతర మైనార్టీలపై కూడా దౌర్జన్యకాండ కొనసాగుతోంది. అక్కడి ప్రజలు వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వ్యాపారాలను నాశనం చేస్తున్నారు. చివరికి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఇద్దరు హిందూ నేతలను కూడా దారుణంగా హత్య చేశారు. ఫలితంగా చాలామంది ప్రాణభయంతో భారత్ రావడానికి యత్నిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాలలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మోహరించింది.. బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బీహార్ జిల్లా శీతల్ కుచీ సరిహద్దులో కంచె దూకి భారత్లోకి వచ్చేందుకు 1000 మంది బంగ్లాదేశ్ కు చెందినవారు ప్రయత్నించారు. అయితే వారందరినీ భారత బలగాలు వెనక్కి పంపించాయి. సరిహద్దు ప్రాంతాల్లో వారంతా సమావేశమై.. తమను భారత్ లోకి రానివ్వాలని నినాదాలు చేశారు. సరిహద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తదుపరి చర్యల విషయంలో వెనుకాడబోమని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.

    బోర్డర్ సెక్యూరిటీ బంగ్లాదేశ్ కు చెందినవారిని వెనక్కి పంపించడంతో సోషల్ మీడియాలో మమతా బెనర్జీ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు..” మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీయులకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మనదేశంలో ఆశ్రయం ఇస్తామని అన్నారు. ఇప్పుడు చూడండి వారంతా మన దేశం వైపు వస్తున్నారు. ఇప్పటికే ఈ దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్నది. ఇది సరిపోదన్నట్టు తలతిక్క వ్యాఖ్యలు చేసి.. మళ్లీ అధికారంలోకి రావాలి అనుకున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీతి మాలిన చర్య. మన దేశం ఏమైనా శరణార్థులకు విడిది కేంద్రమా” అంటూ నెటిజన్లు మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ మాటను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు పక్కన పెట్టిందని.. దేశం కోసం తన పని తాను చేస్తోందని వ్యాఖ్యలు చేస్తున్నారు.