Omicron: తెలంగాణలో ఎంటరైన ‘ఒమిక్రాన్’.. హై అలర్ట్ ప్రకటించిన వైద్యారోగ్య శాఖ!

Omicron:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే చాలా దేశాల్లో తన ప్రభావం చూపుతోంది.చాలా మంది ఒమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదకరమైన ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే ఐదు రేట్లు పవర్ ఫుల్ అని శాస్త్రవేత్తలు […]

Written By: Neelambaram, Updated On : December 15, 2021 1:44 pm
Follow us on

Omicron:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే చాలా దేశాల్లో తన ప్రభావం చూపుతోంది.చాలా మంది ఒమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదకరమైన ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే ఐదు రేట్లు పవర్ ఫుల్ అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ వైరస్‌ను ఎదుర్కొనడానికి సమాయత్తం అయ్యాయి.

Omicron

దేశంలో వేగంగా పెరుగుతున్న కేసులు..

భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇంటర్నేషనల్ ప్రయాణికులు, విమానాలపై ఆంక్షలు విధించాలని ఇప్పటికే కొందరు కేంద్రాన్నిడిమాండ్ చేస్తున్నారు. అప్పటికే జరగాల్సి జరిగిపోయింది. ఇండియాలో తొలి రెండు ఒమిక్రాన్ కేసులు మొదట బెంగళూరులో వెలుగుచూశాయి. ఆ తర్వాత క్రమంగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ మహమ్మారి ఎంటర్ అయ్యింది. దేశంలో ప్రస్తుతం 30కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలో రెండు కేసులు..

తెలంగాణలో రాష్ట్రంలో నిన్నటివరకు ఒమిక్రాన్ కేసుల జాడ లేదు. ఒక్కసారిగా బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. కెన్యా మరియు సోమాలియా నుంచి ఇద్దరి ప్రయాణీకుల శాంపిల్స్ జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబులో పరీక్షించగా వారికి ఒమిక్రాన్ నిర్దారణ జరిగిందని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 12వ తేదిన 24ఏళ్ల మహిళ కెన్యా నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు రాగా ఆమె శాంపిల్స్ టెస్టుకు పంపించామన్నారు. పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆమెకు గచ్చిబౌలిలో గుర్తించి టిమ్స్ ఆస్పత్రికి తరలించామని డీహెచ్ వెల్లడించారు.

Also Read: TRS: టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత మొదలైందా?

అదేవిధంగా 23ఏళ్ల యువకుడు సోమాలియా నుంచి రాగా అతనికి కూడా పాజిటివ్ నిర్దారణ జరిగిందన్నారు. ప్రస్తుతం అతన్ని వెతుకుతున్నామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని కూడా క్వారంటైన్ చేస్తున్నామని చెప్పారు. మరో వ్యక్తికి పాజిటివ్ రాగా అతను ఎయిర్ పోర్టులో దిగి నేరుగా పశ్చిమబెంగాల్ వెళ్లిపోయాడని, హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదన్నారు. ఒమిక్రాన్ వైరస్ కూడా గాలి ద్వారా సోకుతుందని డీహెచ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురవాల్సిన పనిలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినదని వివరించారు. ఇకనుంచి రిస్క్ లేని దేశాల నుంచి వచ్చిన వారికి కూడా ఒమిక్రాన్ టెస్టులు చేయనున్నట్టు శ్రీనివాస్ చెప్పారు. ప్రజలు కూడా బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్కులు ధరించాలన్నారు.

Also Read: Mallanna Army: ‘మల్లన్న’ సైన్యంపై గురిపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్?

Tags